వ్యాయామానికి ముందు.. తర్వాత ఇలా చేస్తే..!

ABN , First Publish Date - 2022-07-27T17:09:50+05:30 IST

వ్యాయామం అనగానే కొందరికి ఒంటి నొప్పులు గుర్తొస్తాయి. నిజానికి వ్యాయామానికి ముందు, తర్వాత

వ్యాయామానికి ముందు.. తర్వాత ఇలా చేస్తే..!

వ్యాయామం అనగానే కొందరికి ఒంటి నొప్పులు గుర్తొస్తాయి. నిజానికి వ్యాయామానికి ముందు, తర్వాత నిర్దిష్ట ఆహార నియమాలు పాటిస్తే, ఒంటి నొప్పులు వేధించవు.


  • సమర్ధమైన వ్యాయామం కోసం తగినంత శక్తి అవసరం. కాబట్టి వ్యాయామానికి ముందు శక్తిని అందించే పిండిపదార్థాలు తీసుకోవాలి. ఇందుకోసం యాపిల్‌, మొక్కజొన్న, బ్రౌన్‌ బ్రెడ్‌ విత్‌ పీనట్‌ బటర్‌ లాంటివి తినాలి. 
  • వ్యాయామం చేస్తున్నప్పుడు అలసటకు లోనవకుండా ఉడకబెట్టిన గుడ్డు తెల్లసొన లేదా అరటిపళ్లు తినవచ్చు.
  • వ్యాయామం తర్వాత కచ్చితంగా మాంసకృత్తులు తీసుకోవాలి. ఇందుకోసం గుడ్డు తెల్లసొన లేదా ఆవిరి మీద ఉడికించిన చికెన్‌, చేప తినవచ్చు. 
  • ప్రొటీన్‌ షేక్‌ అలవాటు ఉన్నవాళ్లు వ్యాయామం పూర్తయిన వెంటనే ప్రొటీన్‌ షేక్‌ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. 

Read more