స్క్వాట్స్‌తో చక్కని రూపం

ABN , First Publish Date - 2022-09-06T15:26:01+05:30 IST

కొందరికి నడుము కింది భాగంలో పిరుదుల దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుంటూ ఉంటుంది. ఈ కొవ్వును కరిగించాలంటే

స్క్వాట్స్‌తో చక్కని రూపం

కొందరికి నడుము కింది భాగంలో పిరుదుల దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుంటూ ఉంటుంది. ఈ కొవ్వును కరిగించాలంటే ‘స్క్వాట్స్‌’ వ్యాయామం చేయాల్సిందే! మొదట్లో కష్టమనిపించినా చేయటం అలవాటు చేసుకుంటే ఈ వ్యాయామం తేలికగానే అనిపిస్తుంది. స్క్వాట్స్‌ ఎలా చేయాలంటే...


  • నిటారుగా నిలబడి మోకాళ్లను వంచి కిందకి కుంగాలి. ఇలా కుంగినప్పుడు నడుం పైభాగాన్ని ముందుకు వంచి, చేతులు రెండూ మడిచి, వేళ్లను కలపాలి.
  • కుంగి లేచేటప్పుడు మోకాళ్లు, పాదాలు సరళ రేఖలో ఉండేలా చూసుకోవాలి.
  • కుర్చీ మీద కూర్చున్నంత ఎత్తు మేరకే కుంగాలి.
  • లేచి నిలబడ్డప్పుడు పిరుదులను, తొడలను బిగించాలి.
  • వంగినప్పుడు ఊపిరి పీల్చుకుని, లేచి నిలబడ్డప్పుడు వదలాలి.
  • ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా 30 స్క్వాట్స్‌ చేస్తే పిరుదుల్లో పేరుకున్న కొవ్వు కరుగుతుంది.

Read more