ఎండ వల్ల వచ్చే నలుపును పోగొట్టాలంటే.. ఇలా చేసి చూడండి!

ABN , First Publish Date - 2022-04-27T17:12:29+05:30 IST

సూర్యకిరణాలు చర్మంమీద పడితే చర్మం కమిలిపోతుంది. అందుకే వేసవిలో చర్మసౌందర్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎండ వల్ల వచ్చే నలుపును పోగొట్టాలంటే..

ఎండ వల్ల వచ్చే నలుపును పోగొట్టాలంటే.. ఇలా చేసి చూడండి!

ఆంధ్రజ్యోతి(27-04-2022)

సూర్యకిరణాలు చర్మంమీద పడితే చర్మం కమిలిపోతుంది. అందుకే వేసవిలో చర్మసౌందర్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎండ వల్ల వచ్చే నలుపును పోగొట్టాలంటే.. మన వంటగదిలో ఉండే పదార్థాలతో ఫేస్‌మాస్క్‌లు వేసుకోవచ్చు. అలాంటివి కొన్ని..


ఎర్రగా పండిన టొమాటో తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత  మంచి నీళ్లతో కడిగేయాలి. టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటంతో పాటు సి-విటమిన్ ఉంటుంది. దీంతో ట్యానింగ్ సులువుగా పోతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది.


నిమ్మరసం, చక్కెర ఫేస్‌మాస్క్‌ను అతి సులువుగా తమారు చేయవచ్చు. ముందుగా ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని బౌల్‌లో తీసుకుని దానికి ఒక టీస్పూన్ చక్కెర జత చేయాలి. ఆ మిశ్రమాన్ని స్ర్కబ్బర్‌లా ముఖానికి పట్టించాలి. ఇలా చేయటం వల్ల ట్యానింగ్ మటుమాయం అవుతుంది. నిమ్మలో విటమిన్ -సి పుష్కలం కాబట్టి చర్మం మరింత మృదువుగా తయారవుతుంది. మొత్తానికి ఈ మాస్క్‌ను వేసుకున్నాక.. పదిహేను నిమిషాల్లో కడిగేయాలి.


కాస్త బొప్పాయి పండు మెత్తని గుజ్జును తీసుకని, అందులోకి టేబుల్ స్పూన్ తేనే, మరో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. మెత్తగా చూర్ణం చేయాలి. ఎండకు చర్మం నల్లబడిన ప్రాంతంలో పట్టిస్తే మెరుగైన ఫలితం ఉంటుంది. ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్‌తో మొటిమల సమస్య దరిచేరదు. 


బౌల్‌లో మూడు టేబుల్ స్పూన్ల అలొవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల తేనె, టేబుల్ స్పూన్ పసుపు వేసి చూర్ణం చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టేబుల్ స్పూన్ శనగపిండి, మరో టేబుల్ స్పూన్ పసుపు కలపాలి. ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టిస్తే ట్యానింగ్ బాధ పోతుంది.

Updated Date - 2022-04-27T17:12:29+05:30 IST