ఆపరేషన్ తర్వాత దగ్గరి, దూరం చూపు బాగా కనపడాలంటే.. కళ్లజోడు పెట్టుకోవాలా?
ABN , First Publish Date - 2022-02-03T18:25:21+05:30 IST
పురుషులతో పోలిస్తే మహిళలకు శుక్లాలు ఎక్కువగా వస్తాయా? కాటరాక్ట్ ఆపరేషన్ తర్వాత దగ్గరి చూపు, దూరం చూపు బాగా కనపడాలంటే.. కళ్లజోడు పెట్టుకోవాలా?

ఆంధ్రజ్యోతి(03-02-2022)
ప్రశ్న: పురుషులతో పోలిస్తే మహిళలకు శుక్లాలు ఎక్కువగా వస్తాయా? కాటరాక్ట్ ఆపరేషన్ తర్వాత దగ్గరి చూపు, దూరం చూపు బాగా కనపడాలంటే.. కళ్లజోడు పెట్టుకోవాలా?
డాక్టర్ సమాధానం: పురుషులు, మహిళలకొచ్చే శుక్లాలు విషయంలో ఎలాంటి వ్యత్యాసమూ ఉండదు. శుక్లం అనేది వయసుతో పాటు అందరికీ వచ్చేదే. యాభై ఏళ్లకా, అరవై ఏళ్లకు వస్తుందా? అని అడిగితే.. ఆయా వ్యక్తుల జన్యువుల ఆధారంగా శుక్లాలు వస్తుంటాయి. పురుషులైనా, స్ర్తీలైనా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే.. షుగర్, బీపీ, స్టెరాయిడ్స్ తీసుకున్నపుడు, కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకున్నపుడు ఏ వయసులోనైనా శుక్లాలు వస్తుంటాయి.
స్ర్తీల విషయానికొస్తే.. మెనోపాజ్ తర్వాత కంటికి సంబంధించిన శ్రద్ధ పెద్దగా అవసరం లేదు. ఈస్ర్టోజన్ తక్కువ ఉంటుంది కాబట్టి కళ్లు ఎక్కువగా పొడిబారుతాయి. ముఖ్యంగా డయాబెటిక్ అయినా, కాకపోయినా రెటీనాలో మాక్యులర్ హోల్ అనేది వయసుతో పాటు చూస్తాం. అది స్ర్తీలలో ఎక్కువగా కనపడుతుంది. అందుకే రెటీనా చెకప్‌లు చేయించుకున్నపుడు తెలుస్తుంది. ఇక శుక్లం ఆపరేషన్ తర్వాత అన్ని పోతాయా? అనే సందేహం కొందరికి ఉంటుంది. కొంతమంది కళ్లజోళ్లలో సిలిండ్రికల్ పవర్, స్పెరికల్ పవర్‌ను ఇస్తుంటాం. అట్లాగే లోపల లెన్సును అమర్చాల్సి వస్తుంది. కొంతమందికి స్పెరికల్ లెన్స్ పెడితే సరిపోతుంది. మరికొంతమందికి స్పెరికల్, సిలిండ్రికల్.. రెండు కూడా కరెక్ట్ చేయాల్సి వస్తుంది. కేవలం స్పెరికల్ లెన్సు పవర్ పెట్టాక సిలిండ్రికల్ పవర్ మిగిలిపోతే.. దూరం చూడటానికి కళ్లజోడు అంటారు.
ఇవన్నీ మోనోఫోకల్ లెన్స్ అంటాం. వీటన్నింటికి కళ్లజోడు అవసరం. దూరం చూపు, దగ్గరకి వేటికీ అవసరం లేకుండా ఉండాలంటే.. మల్టీఫోకల్ అలైవల్స్ ఉంటాయి. వాటితో కళ్లజోడు అవసరం ఉండదు. బయోమెట్రిక్ టెస్టులుంటాయి. క్యాటరాక్ట్ సర్జరీ చేసేప్పుడు బయోమెట్రిక్ స్కానింగ్‌లో అన్ని చూసుకుని చేస్తాం. దూరంకు వద్దు, దగ్గరక వద్దు..ఇలా రిక్వైర్‌మెంట్‌కి లెన్స్ కాస్ట్ పెరుగుతుంటుంది. అందుకే కాటరాక్ట్ సర్జరీలకు ధర పెరుగుతుంది.
- డాక్టర్ శ్రీలక్ష్మి నిమ్మగడ్డ
మేనేజింగ్ డైరక్టర్
విన్ విజన్ ఐ హాస్పిటల్స్
