ఈస్ట్రోజన్‌ హార్మోన్ తగ్గిందా? కారణాలేంటి?

ABN , First Publish Date - 2022-05-24T21:29:23+05:30 IST

మహిళల ఆరోగ్యంలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్‌ తగ్గుదల ఎదుగుదల లోపాలకు దారి తీయడంతో పాటు, శరీర జీవక్రియల పనితీరు

ఈస్ట్రోజన్‌ హార్మోన్ తగ్గిందా? కారణాలేంటి?

ఆంధ్రజ్యోతి(24-05-2022)

మహిళల ఆరోగ్యంలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్‌ తగ్గుదల ఎదుగుదల లోపాలకు దారి తీయడంతో పాటు, శరీర జీవక్రియల పనితీరు కుంటుపడడానికీ కారణమవుతుంది. కాబట్టి ఈ హార్మోన్‌ లోపాన్ని లక్షణాల ద్వారా ప్రారంభంలోనే గుర్తించడం అవసరం. 


తగ్గుదలకు కారణాలు

ఈ హార్మోన్‌ అండాశయాల్లో తయార వుతుంది. కాబట్టి అండాశయాల మీద ప్రభావం చూపించే అంశాలన్నీ ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తికి ప్రతిబంధకంగా మారతాయి. అవేంటంటే..

అవసరానికి మించిన వ్యాయామం

తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి

టర్నర్‌ సిండ్రోమ్‌ (ఒకే ఎక్స్‌ క్రోమోజోమ్‌తో ఆడపిల్లలు పుట్టడం)

పిట్యుటరీ గ్రంథి మందకొడిగా పని చేయడం

అనరొక్సియా (ఈటింగ్‌ డిజార్డర్‌)

ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌ లేదా మరేదైనా ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌

అండాశయాలకు రక్తసరఫరాలో అడ్డంకులు ఏర్పడడం

మెగ్నీషియం లోపం

కుటుంబ నియంత్రణ మాత్రలతో ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టరాన్‌ హార్మోన్ల ఉత్పత్తి తగ్గడం

హైపోథైరాయిడిజం


ఈస్ట్‌ ఓవర్‌గ్రోత్‌ లోపాన్ని తెలిపే లక్షణాలు

ప్యూబర్టీకి చేరువవుతున్న ఆడపిల్లల్లో, మెనోపాజ్‌కు చేరువవుతున్న మహిళలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ లోపం తలెత్తుతుంది. అయితే అన్ని వయసుల మహిళల్లో కూడా ఈ సమస్య తలెత్తే అవకాశాలు లేకపోలేదు. అయితే ఈస్ర్టోజన్‌ హార్మోన్‌ తగ్గినప్పుడు, మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి.

ఒంటి నుంచి వేడి ఆవిర్లు

భావోద్వేగాలు అదుపు తప్పడం

మానసిక కుంగుబాటు

తలనొప్పులుఅలసట

ఏకాగ్రతా లోపం 

నెలసరి సమస్యలు

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు

ఎముకల బలహీనత


ఇలా పెంచుకోవచ్చు

తగ్గిన ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ మోతాదును పెంచుకునే ప్రత్యామ్నాయాలున్నాయి. ఇందుకోసం వైద్యుల పర్యవేక్షణలో పిల్స్‌, జెల్స్‌ వాడుకోవచ్చు. అయితే సహజసిద్ధంగా శరీరంలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తయ్యేలా మార్గాలను అనుసరించడం అన్నిటికంటే ఉత్తమం ఇందుకోసం....

ఫైటో ఈస్ట్రోజన్స్‌: ఈ పోషకాలు ఉండే ఆహారాన్ని తింటూ ఉండాలి. టోఫు, సోయా, బఠాణీలు, అప్రికాట్స్‌, బ్రొకొలి, కాలీఫ్లవర్‌, ఫ్లాక్స్‌ సీడ్స్‌, గుమ్మడి విత్తనాలు, పెసర మొలకల్లో ఫైటో ఈస్ట్రోజన్స్‌ ఉంటాయి.

చక్కెర: చక్కెర తినే అలవాటు హార్మోన్లలో అవకతవకలకు దారి తీస్తుంది. అలాగే చక్కెర ఈస్ట్‌ ఓవర్‌గ్రోత్‌ను ప్రేరేపిస్తుంది. ఈ ఈస్ట్‌కు సంబంధించిన టాక్సిన్లు హార్మోన్‌ ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్‌ రిసెప్టార్‌ సైట్లను బ్లాక్‌ చేస్తాయి. కాబట్టి చక్కెర తినడం తగ్గించాలి.

మెగ్నీషియం: ఈ పోషకంతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్లు (చిలగడ దుంపలు), సహజసిద్ధ మూలికలు (తులసి, సేజ్‌, పుదీనా)లను తీసుకుంటే సెల్‌ రిసెప్టివిటీ పెరిగి ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరుగుతుంది.

బరువు: తక్కువ బరువు ఉన్నా శరీరం సరిపడా ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ను తయారు చేసుకోలేదు. హార్మోన్లను తయారు చేసుకోవడం కోసం శరీరంలో సరిపడా కొవ్వు ఉండడం అవసరం. 

వ్యాయామం: అవసరానికి మించిన వ్యాయామం ఈస్ట్రోజన్‌ ఉత్పత్తిని తగ్గిస్తే, క్రమం తప్పకుండా సరిపడా వ్యాయామం చేయడం వల్ల తగినంత ఈస్ట్రోజన్‌ శరీరంలో ఉత్పత్తి అవుతూ రొమ్ము కేన్సర్‌ నుంచి రక్షణ దక్కుతుంది. కాబట్టి క్రమం తప్పక పరిమితంగా వ్యాయామం చేయాలి. 

ద్రవాహారం: నీళ్లు, పండ్లు, కూరగాయల రసాలు, గ్రీన్‌ టీ, కొబ్బరినీళ్లు, మజ్జిగ తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోయి, ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ తగ్గి, హార్మోన్ల ఉత్పత్తి మెరుగవుతుంది.


ఈస్ట్రోజన్‌ పెరిగితే?

కొందర్లో అవసరానికి మించి ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ పెరుగుతుంది. ఈ పరిస్థితిని ఈస్ట్రోజన్‌ డామినెన్స్‌ అంటారు. దీన్ని కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తించే వీలుంది. అవేంటంటే...

కడుపు ఉబ్బరం

భావోద్వేగాలు అదుపు తప్పడం

తలనొప్పులు

అలసట

నెలసరి సమస్యలు

అరిచేతులు, అరికాళ్లు చల్లబడడం

బరువు పెరగడం

వెంట్రుకలు రాలిపోవడం

యాంగ్జయిటీ/ప్యానిక్‌ ఎటాక్స్‌

జ్ఞాపకశక్తి సమస్యలు

రొమ్ముల సలపరం

Updated Date - 2022-05-24T21:29:23+05:30 IST