డిప్రెషన్ ఇలా దూరం
ABN , First Publish Date - 2022-07-19T19:39:26+05:30 IST
డిప్రెషన్‌కు కారణాలు బాహ్యమైనవే అయినా నిజానికి మెదడులోని రసాయనాలు హెచ్చుతగ్గులకు లోనవడం

డిప్రెషన్‌కు కారణాలు బాహ్యమైనవే అయినా నిజానికి మెదడులోని రసాయనాలు హెచ్చుతగ్గులకు లోనవడం వల్లనే ఈ రుగ్మత తలెత్తుతుంది. వంశపారంపర్యం, నిద్రలేమి, తీవ్ర వ్యాధులు, పోషక లోపాలు మొదలైనవి కూడా డిప్రెషన్‌కు కారణాలే! ఏది ఏమైనప్పటికీ, చదువు, వ్యక్తిగత అనుబంధాలు, ఒత్తిడిలు కూడా డిప్రెషన్‌కు గురి చేస్తూ ఉంటాయి. అయితే ఎలాంటి నిరాశానిస్పృహలకైనా కొన్ని ఆయుర్వేద ఔషధాలు మెదడుకు టానిక్‌లా పని చేసి, చురుకుదనాన్ని పెంచి, డిప్రెషన్‌ను పారదోలతాయి.
ప్రధాన ఔషధాలు ఇవే!
బ్రహ్మి: ఈ మూలిక జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పసికందుల్లో మెదడు ఎదుగుదలకు తోడ్పడే ఈ మూలిక, ఆందోళన, ఒత్తిడి, నరాల సమస్యలను సైతం నివారిస్తుంది. తలనొప్పులకు ఇది దివ్యౌషధం.
శంకపుష్టి: నరాల బలహీనతకు చక్కని మందు ఇది. మొద్దుబారిన మెదడును ఉత్తేజపరిచే గుణం ఈ ఔషధానికి ఉంది.
జటామానసి: జటామానసి వేరు మానసిక స్థితిని సరిదిద్దుతుంది. ఆందోళన, డిప్రెషన్‌తోపాటు ఇతరత్రా మానసిక వ్యాధులకు ఇది మంచి మందు.