వెన్ను నొప్పి ఇలా దూరం

ABN , First Publish Date - 2022-09-06T15:34:34+05:30 IST

ఎక్కువ సమయాల పాటు కూర్చునే ఉండడం, కూర్చునే భంగిమలో పొరపాట్లు, వెన్ను ముందుకు వంచి కూర్చోవడం

వెన్ను నొప్పి ఇలా దూరం

క్కువ సమయాల  పాటు కూర్చునే ఉండడం, కూర్చునే భంగిమలో పొరపాట్లు, వెన్ను ముందుకు వంచి కూర్చోవడం మొదలైన అలవాట్ల వల్ల వెన్నుముకలోని పూసలు పట్టు తప్పడం, అరిగిపోవడం, తొలగడం లాంటి సమస్యలు మొదలవుతాయి. అధిక బరువు, మోకాళ్లను వంచకుండా బరువైన వస్తువులను ఎత్తే ప్రయత్నం చేయడం, ఎక్కువ సమయాల పాటు పెద్ద పిల్లలను ఎత్తుకుని తిప్పడ లాంటి అలవాట్లతో చేతులు, కాళ్లు లాగడం, వెన్ను నొప్పి వేధిస్తాయి. ఈ తిప్పలు తప్పాలంటే సుప్తమత్స్యేంద్రాసనం సాధన చేయాలి. అదెలాగంటే...


  • వెల్లకిలా పడుకుని చేతులు నేల మీద చాపి ఉంచాలి.
  • కుడి కాలును మడిచి, ఎడమ కాలి మీదుగా శరీరం పక్కకు వంచి, నేలను తాకించాలి.
  • ఇలా నేలను తాకిన కుడి కాలును ఎడమ చేత్తో పట్టుకోవాలి.
  • ఇలా చేస్తున్నప్పుడు నడుము కింది భాగం మాత్రమే కదలాలి. అంతేగానీ శరీరం మొత్తం కాలుతోపాటు కదపకూడదు.
  • ఈ భంగిమలో అరగంటపాటు ఉండి రెండోవైపు సాధన చేయాలి.
  • ఆసనం పూర్తయిన తర్వాత కాళ్లు రెండు నేలకు ఆనించి పడుకుని, నెమ్మదిగా పైకి లేవాలి.

ఈ ఆసనంతో వెన్ను, భుజాలు, కటి, కాళ్లలోని కండరాలు వదులై, ఉపశమనం దక్కుతుంది. క్రమం తప్పక ఈ ఆసనం సాధన చేయడం వల్ల, నడుము పట్టేయడం, అదే పనిగా ఇబ్బంది పెడుతూ ఉండడం లాంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఈ ఆసనాన్ని సాధన చేయాలి. మొదట్లో అనుభవజ్ఞులైన యోగా శిక్షకుల పర్యవేక్షణలో ఈ ఆసనాన్ని సాధన చేయాలి. 

Updated Date - 2022-09-06T15:34:34+05:30 IST