జీర్ణవ్యవస్థకు మేలు చేసే అప్రికాట్‌ టీ!

ABN , First Publish Date - 2022-02-23T17:19:25+05:30 IST

అప్రికాట్‌లు - 10, టీ బ్యాగు - 1, పంచదార - తగినంత, యాలకులు - నాలుగు, దాల్చిన చెక్క - చిన్న ముక్క. పుదీనా ఆకులు - కొన్ని.

జీర్ణవ్యవస్థకు మేలు చేసే అప్రికాట్‌ టీ!

కావలిసినవి: అప్రికాట్‌లు - 10, టీ బ్యాగు - 1, పంచదార - తగినంత, యాలకులు - నాలుగు, దాల్చిన చెక్క - చిన్న ముక్క. పుదీనా ఆకులు - కొన్ని.


ఇలా చేయాలి: అప్రికాట్స్‌ను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నాలుగు కప్పుల నీళ్లు పోసి అప్రికాట్‌ ముక్కలు, పంచదార వేసి మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో యాలకులు. దాల్చినచెక్క వేయాలి. అప్రికాట్స్‌ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తరువాత యాలకులు, దాల్చినచెక్క తీసివేయాలి.  సన్నటి జాలీతో నీటిని వడబోసుకోవాలి. టీకప్పులో ఆ నీళ్లను తీసుకుని టీ బ్యాగు వేసుకోవాలి.  మెత్తగా ఉడికిన అప్రికాట్‌లను జార్‌లో వేసి పేస్టులా పట్టుకోవాలి.  తరువాత కప్పులో ఒక స్పూన్‌ అప్రికాట్‌ పేస్టు వేసుకోవాలి. టీ బ్యాగు తీసేయాలి.   పుదీన ఆకులు వేసుకుని వేడి వేడి అప్రికాట్‌ టీ సర్వ్‌ చేసుకోవాలి.


ప్రయోజనాలు: అప్రికాట్‌లో బీటా కెరోటిన్‌, విటిమిన్‌ -ఎ, విటమిన్‌ -సి సమృద్ధిగా లభిస్తాయి. పాలీఫెనాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. వీటిని ఫ్లావనాయిడ్లు అంటారు. వైరల్‌ వ్యాధుల బారినపడకుండా ఇవి కాపాడతాయి. అంతేకాదు ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ నుంచి రక్షిస్తాయి. అప్రికాట్‌లో ఉండే నీటిలో కరిగే ఫైబర్‌ వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.

Updated Date - 2022-02-23T17:19:25+05:30 IST