ఇకపై కరోనాకు కొత్త పరీక్ష
ABN , First Publish Date - 2022-07-05T18:36:59+05:30 IST
నాసల్ స్వాబ్స్, రక్త పరీక్ష.. కొవిడ్ ఇన్ఫెక్షన్ను నిర్ధారించడం కోసం ఇప్పటివరకూ ఈ పరీక్షల మీదే ఆధారపడుతున్నాం
నాసల్ స్వాబ్స్, రక్త పరీక్ష.. కొవిడ్ ఇన్ఫెక్షన్ను నిర్ధారించడం కోసం ఇప్పటివరకూ ఈ పరీక్షల మీదే ఆధారపడుతున్నాం. అయితే అసౌకర్యం కలిగించే ఈ పరీక్షల నుంచి విముక్తిని కల్పిస్తూ, టోక్యో యూనివర్శిటీకి చెందిన జపాన్ పరిశోధక బృందం, మూడు నిమిషాల వ్యవధిలోనే కొవిడ్ యాంటీబాడీల ఉనికిని నిర్ధారించే ఒక ప్యాచ్‌ను అభివృద్ధి చేసింది. చర్మం అడుగున ఉండే ఎపిడెర్మిస్, డెర్మిస్ పొరల్లో ఉండే ఇంటర్‌స్టీషియల్ ఫ్లూయిడ్ (ఐఎస్ఎఫ్)లోని యాంటీబాడీల పరిమాణాన్ని లెక్కించే సూత్రం ఆధారంగా, ఈ ప్యాచ్ పరీక్షను వాళ్లు అభివృద్ధి చేశారు. ఈ సరికొత్త యాంటీబాడీ పరీక్ష, సార్స్ కొవిడ్-2ను ఎంతో వేగంగా, కచ్చితంగా పసిగడుతుంది. గోల్డ్ నానోపార్టికల్స్‌ను కలిగి ఉండే ఈ టెస్టింగ్ స్ట్రిప్స్, ప్రస్తుతం పలు దేశాల్లో విస్తృతంగా వాడుకలోకొచ్చాయి.