జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్‌: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పాగా.. గోవాలోనూ ముందంజ

ABN , First Publish Date - 2022-03-08T01:18:19+05:30 IST

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సోమవారం సాయంత్రంతో ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ..

జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్‌: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పాగా.. గోవాలోనూ ముందంజ

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో  అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సోమవారం సాయంత్రంతో ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పాగా వేసే వీలుంది. గోవాలోనూ ముందంజలో ఉంది.


ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 35 నుంచి 40 సీట్లు గెలుచుకుని మొదటి వరుసలో నిలిచే అవకాశం ఉంది. బీజేపీ 26 నుంచి 30 సీట్లు, బీఎస్‌పీ 2 నుంచి 3, ఇతరుల ఒకటి నుంచి మూడు సీట్లు గెలుచుకోవచ్చు.


గోవాలోని 40 స్థానాలకు గాను కాంగ్రెస్ 14 నుంచి 19 సీట్లు గెలుచుకుని ముందు వరుసలో నిలిచే అవకాశం ఉంది. బీజేపీ సైతం 13 నుంచి 18 సీట్లు వరకూ గెలుచుకోవచ్చు. ఎంజీపీ, మిత్రపక్షాలు 2 నుంచి 5 సీట్లు, ఆప్ ఒకటి నుంచి 3 సీట్లు, ఇతరులు 1 నుంచి 3 సీట్లు గెలుచుకునే వీలుంది.


మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 32 నుంచి 38 సీట్ల వరకూ గెలుచుకుని ముందు వరుసలో నిలుస్తుంది. కాంగ్రెస్ 12 నుంచి 17 సీట్లు, ఎన్‌పీఎఫ్ 3 నుంచి 5, ఎన్‌పీపీ 2 నుంచి 4, ఇతరులు 2 నుంచి 5 సీట్లు గెలుచుకునే వీలుంది.


పంజాబ్‌లోని 117 సీట్లలో ఆప్ 52 నుంచి 61 సీట్లు గెలుచుకుని మొదటి స్థానంలో నిలిచే వీలుంది. కాంగ్రెస్ 26 నుంచి 33 సీట్లు, సాద్ కూటమి 24 నుంచి 32 సీట్లు, బీజేపీ, మిత్రపక్షాలు 3 నుంచి 7 సీట్లు, ఇతరులు ఒకటి నుంచి రెండు సీట్లు గెలుచుకునే వీలుంది.

Updated Date - 2022-03-08T01:18:19+05:30 IST