బరిలో మహిళలేరీ..!

ABN , First Publish Date - 2022-02-23T08:12:54+05:30 IST

మణిపూర్‌.. ఈశాన్య భారతంలోని ఓ చిన్న రాష్ట్రం. మహిళా ఓటర్లు అధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో.. రాజకీయంగా ...

బరిలో మహిళలేరీ..!


ఇంఫాల్‌, ఫిబ్రవరి 22: మణిపూర్‌.. ఈశాన్య భారతంలోని ఓ చిన్న రాష్ట్రం. మహిళా ఓటర్లు అధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో.. రాజకీయంగా మాత్రం వారిది పరిమిత పాత్రే! 60 సీట్లున్న అసెంబ్లీలో.. వారి ప్రాతినిధ్యం అతి స్వల్పం. ప్రస్తుతం ఇద్దరంటే ఇద్దరే మహిళా ఎమ్మెల్యేలున్నారు. వారిలో ఒకరు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఏకే మీరాబాయ్‌ కాగా.. మరొకరు అధికార బీజేపీకి చెందిన నెంచా కిగ్‌పెన్‌. అవి కూడా రిజర్వేషన్లలో మహిళలకు కేటాయించిన సీట్లే! నిజానికి ఇక్కడ మహిళా ఓటర్ల సంఖ్య పురుషులతో పోలిస్తే అధికం. ఈ రాష్ట్రంలో మొత్తం 20,34,966 మంది ఓటర్లు ఉండగా.. అందులో సగానికి పై గా.. అంటే.. 10,49,639 మంది మహిళలే ఉన్నారు. అసెంబ్లీ లో మాత్రం వారి ప్రాతినిధ్యం అతి స్వల్పం. ఈ ఎన్నికల్లోనై నా వారికి సముచిత గౌరవం దక్కుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో పోటీలో ఉన్న మ హిళా అభ్యర్థుల సంఖ్య 17 మాత్రమే. అందులో కాంగ్రెస్‌, బీజేపీ చెరో ముగురికి టికెట్లు ఇవ్వగా.. ఎన్సీపీ, ఎన్పీపీలు ఇద్దరేసి మహిళలకు అవకాశమిచ్చాయి. జేడీయూ ఒక్క మహిళనే బరిలోకి నిలిపింది.

Updated Date - 2022-02-23T08:12:54+05:30 IST