అఖిలేష్‌ను తప్పు పట్టలేం: శరద్ పవార్

ABN , First Publish Date - 2022-03-10T21:31:20+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ విజయం మరోసారి ఖాయం కావడం..

అఖిలేష్‌ను తప్పు పట్టలేం: శరద్ పవార్

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో  బీజేపీ విజయం మరోసారి ఖాయం కావడం, అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ వెనకబడంపై ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. అఖిలేష్ యాదవ్‌ను తప్పుపట్టలేమని, ఆయన సొంత దన్నుపైనే పోటీ చేశారని అన్నారు. దేశంలోని ఉన్నత స్థాయి నాయకులలో ఆయన కూడా ఒకరని, ఆ కారణంగానే ఆయన ఎన్నికల ఫలితాల గురించి ఆలోచించలేదని అన్నారు. అయితే, గతంలో కంటే ఆయన ఈసారి గట్టిపోరాటం సాగించారని అన్నారు..


ప్రధానిపై ఆగ్రహంతోనే...

పంజాబ్ ప్రజలు బీజేపీని, కాంగ్రెస్‌ను ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారని, పంజాబ్ రైతుల హృదయాల్లో మోదీపై కోపం మెండుగా ఉందని అన్నారు. మహారాష్ట్ర వరకూ వస్తే బీజేపీ మరో రెండున్నరేళ్లు వేచిచూడాల్సి వస్తుందని పవార్ పేర్కొన్నారు.

Read more