కాంగ్రెస్ ఘోర ఓటమి.. సిద్ధూ రాజీనామా
ABN , First Publish Date - 2022-03-10T19:22:32+05:30 IST
117 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పంజాబ్‌లో గత ఎన్నికల్లో 77 స్థానాలతో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఈసారి 20 స్థానాలు గెలవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది..

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పంజాబ్‌లో కాంగ్రెస్ ఘోట ఓటమి పాలైన విషయం తెలిసిందే. పూర్తి ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. అప్పుడే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నవజ్యోత్ ప్రకటించడం విశేషం. ఇక సిద్ధూ పోటీ చేసిన స్థానంలో కూడా ఫలితాలు తారుమారు అయ్యాయి. అమృత్‌సర్ తూర్పు నుంచి పోటీ చేసిన సిద్ధూ.. ఆ స్థానం నుంచి పరాభవం పాలయ్యారు.
117 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పంజాబ్‌లో గత ఎన్నికల్లో 77 స్థానాలతో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఈసారి 20 స్థానాలు గెలవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం 18 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సైతం ఓటమి పాలయ్యారు. ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఢీలా పడిపోయింది.