పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు ఇవే

ABN , First Publish Date - 2022-03-11T01:33:49+05:30 IST

వీటితో పాటు బీజేపీ, బీఎస్పీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ లాంటి పార్టీలు పోటీలో నిలిచాయి. ఈ పార్టీలు వాటి సామర్థ్యం మేరకు సీట్లు సంపాదించాయి. శరోమణితో పొత్తు పెట్టుకుని పోటీకి దిగిన బీఎస్పీ ఒక స్థానాన్ని గెలుచుకుంటే మాజీ...

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు ఇవే

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు విడుదల అయ్యాయి. ముందు నుంచి ఆధిక్యంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. 80 శాతానికి పైగా సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడమే కాకుండా అతి తక్కువ స్థానాలకు పడిపోయింది. పంజాబీ పార్టీ అయిన శిరోమణి అకాలీదళ్ అయితే చాలా దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం మూడు స్థానాల్లోనే అభ్యర్థుల్ని గెలిపించుకోగలిగింది. పంజాబ్‌లో ప్రధాన పోటీదారులుగా ఉన్న మూడు పార్టీల పరిస్థితి ఇది.


వీటితో పాటు బీజేపీ, బీఎస్పీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ లాంటి పార్టీలు పోటీలో నిలిచాయి. ఈ పార్టీలు వాటి సామర్థ్యం మేరకు సీట్లు సంపాదించాయి. శరోమణితో పొత్తు పెట్టుకుని పోటీకి దిగిన బీఎస్పీ ఒక స్థానాన్ని గెలుచుకుంటే మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ రెండు స్థానాలు గెలిచింది. వీరికి తోడు ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రముఖులంతా ఓటమి పాలయ్యారు. మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అభ్యర్థులు అందరూ ఓడిపోయారు.


117 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీ తుది ఫలితాలు (ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం)

ఆమ్ ఆద్మీ పార్టీ - 92

బహుజన్ సమాజ్‌ పార్టీ - 1

భారతీయ జనతా పార్టీ - 2

కాంగ్రెస్ - 18

శరోమణి అకాలీ దళ్ - 3

స్వతంత్రులు - 1

Read more