Himchal, Gujarat Results: ఖర్గే తొలి స్పందన ఇదే...

ABN , First Publish Date - 2022-12-08T16:40:25+05:30 IST

హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తొలిసారి ..

Himchal, Gujarat Results: ఖర్గే తొలి స్పందన ఇదే...

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తొలిసారి స్పందించారు. కాంగ్రెస్‌ను గెలిపించిన హిమాచల్ ప్రదేశ్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. "హిమాచల్ ఎన్నికల్లో గెలిచాం. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతల చేసిన కృషి ఫలితంగా ఈ విజయం సాధించాం. వారందరికీ కృతజ్ఞతలు. ప్రియాంక గాంధీ, భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సోనియాగాంధీ ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉన్నాయి'' అని ఖర్గే మీడియాతో మాట్లాడుతూ అన్నారు. గుజరాత్‌లో పార్టీ ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమని అన్నారు. ఇది తమ సైద్ధాంతిక పోరాటమని, ఈ పోరాటంలో లోటుపాట్లు సవరించుకుని పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.

Updated Date - 2022-12-08T16:42:17+05:30 IST