Munugode Election Results: తెలంగాణ భవన్‌లో సంబురాలు

ABN , First Publish Date - 2022-11-06T16:13:32+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు దిశగా వెళ్తున్నారు. మునుగోడులో విజేత ఎవరో దాదాపుగా తెలిసిపోయింది.

Munugode Election Results: తెలంగాణ భవన్‌లో సంబురాలు

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు దిశగా వెళ్తున్నారు. మునుగోడులో విజేత ఎవరో దాదాపుగా తెలిసిపోయింది. ప్రభాకర్‌రెడ్డికే మునుగోడు ఓటర్లు జై కొట్టారు. ప్రతి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. 12వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 7440 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ 5398 ఓట్లు వచ్చాయి. 12వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 2042 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇక మూడు రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఈ మూడు రౌండ్లు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఓట్లు వస్తాయని గులాబీ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. మునుగోడులో గెలుపు దిశగా టీఆర్ఎస్ దూసుకుపోతోంది. దీంతో తెలంగాణ భవన్‌లో బాణాసంచా కాల్చి టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Updated Date - 2022-11-06T16:22:21+05:30 IST