బీజేపీకి షాక్...ఎస్‌పీలో చేరిన రీటా బహుగుణ తనయుడు

ABN , First Publish Date - 2022-03-06T02:28:33+05:30 IST

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ఈనెల 7న జరుగనున్న తరుణంలో బీజేపీకి..

బీజేపీకి షాక్...ఎస్‌పీలో చేరిన రీటా బహుగుణ తనయుడు

అజాంగఢ్: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ఈనెల 7న జరుగనున్న తరుణంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ ఎంపీ రీటా బహుగణ జోషి తనయుడు మయాంక్ జోషి తమ పార్టీలో చేరినట్టు ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. అజాంగఢ్‌లో శనివారం జరిగిన ర్యాలీలో అఖిలేష్ ఈ ప్రకటన చేశారు.


లక్నో కంటోన్మెంట్ నుంచి తన కుమారుడి మయాంక్ జోషికి టిక్కెట్ ఇవ్వాలని గత జనవరిలో రీటా బహుగుణ బీజేపీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. అయితే బీజేపీ అందుకు నిరాకరించింది. దీంతో పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానంటూ రీటా బహుగుణ ముక్తసరిగా ప్రకటించారు. ఈ క్రమంలోనే సుమారు 2 నెలల పాటు యూపీలో జరిగిన ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. దీనికి కొద్ది నిమిషాలకు ముందే సమాజ్‌వాదీ పార్టీలో మయాంక్ జోషి  చేరినట్టు అఖిలేష్ ప్రకటించడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తొంగిచూసింది.

Read more