Delhi Civic Polls Result: ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ కంటే స్వల్ప ఆధిక్యంలో ఆప్ వార్డు అభ్యర్థులు
ABN , First Publish Date - 2022-12-07T10:13:41+05:30 IST
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల కంటే ఆప్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు...
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల కంటే ఆప్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.(AAP ward candidates)వార్డుల వారీగా, రౌండ్ల వారీగా ఫలితాలు ప్రతీ అరగంటకు మారుతున్నాయి. ఈ ఫలితాల్లో ఆమ్ ఆద్మీపార్టీ, బీజేపీ(BJP) నువ్వా? నేనా?అన్నట్లు సాగుతోంది. (Delhi Civic Polls Result)ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోని 250 వార్డులకు ఎన్నికలు జరగ్గా ఆప్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే 123 వార్డుల్లో ఆప్ అభ్యర్థులు విజయం దిశగా పయనిస్తున్నారు. మరో వైపు ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ 115 వార్డుల్లో ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఐదు స్థానాల్లో ఇతర అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థుల కంటే ముందుకు సాగుతున్నారు. మొత్తంమీద వార్డుల వారీగా పలు రౌండ్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు తుది ఫలితాన్ని ప్రకటించక పోయినా ఓట్ల ఆధిక్యతను బట్టి పరిశీలిస్తే ఎంసీడీ ఎన్నికల్లో ఆప్, బీజేపీల మధ్య పోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది.