పోలింగ్ డే: యూపీలో మూడో విడత, పంజాబ్‌లో ఒకే విడత

ABN , First Publish Date - 2022-02-20T02:20:08+05:30 IST

ఒకే విడతలో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ఆదివారంనాడు..

పోలింగ్ డే: యూపీలో మూడో విడత, పంజాబ్‌లో ఒకే విడత

న్యూఢిల్లీ: ఒకే విడతలో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ఆదివారంనాడు జరుగనుంది. ఇందుకు భారత ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతల పోలింగ్‌లో భాగంగా మూడో విడత పోలింగ్ 16 జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో జరుగనుంది. 627 మందికి పైగా అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా, 2.15 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  ఫిరోజాబాద్, ఇటా, కాస్‌గంజ్, మెయిన్‌పురి, ఫురూఖాబాద్, కన్నౌజ్, ఇటావా, కాన్పూ ర్ దెహత్, కాన్పూర్ నగర్, జలౌన్, ఝాన్సీ, తలిత్‌పూ ర్, హమీర్‌పూర్, మోహబా‌ జిల్లాలు ఈ విడత పోలింగ్‌లో ఉన్నాయి. ఆదివారంనాడు పోలింగ్ జరిగే కర్హాల్ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీ పడుతున్నారు. ఆయనపై బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి ఎస్‌పీ సింగ్ బఘెల్ పోటీ చేస్తున్నారు.


పంజాబ్‌లో 117 సీట్లకూ ఒకేసారి...

పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఒకే విడతగా పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలతో పోలింగ్ పూర్తవుతుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Read more