UPSCలో 67 ఉద్యోగాలు
ABN , First Publish Date - 2022-04-30T21:48:40+05:30 IST
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వారీగా ఖాళీలు: అసిస్టెంట్ కెమిస్ట్-22, అసిస్టెంట్ జియోఫిజిస్ట్ 40.
విభాగాలు: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ తదితరాలు
అర్హత:
అసిస్టెంట్ కెమి్స్ట: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు ఉండాలి
అసిస్టెంట్ జియోఫిజిస్ట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ఏఎంఐఈ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
ఇతర పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 35 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తుకు చివరి తేదీ: మే 12
వెబ్సైట్: https://www.upsc.gov.in/