UPSC: కేంద్ర విభాగాల్లో ఆఫీసర్లు
ABN , First Publish Date - 2022-11-03T16:51:29+05:30 IST
వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)... అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)... అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 15
1. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్: 1 పోస్టు
2. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్(బయాలజీ): 1 పోస్టు
3. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్(కెమిస్ట్రీ): 1 పోస్టు
4. ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-1: 12 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/బీటెక్/పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి
వయోపరిమితి: 2022 అక్టోబరు 27 నాటికి ఇన్వెస్టిగేటర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు 38 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.25(ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది)
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 10
వెబ్‌సైట్: https://www.upsc.gov.in