Airport Authorityలో ట్రేడ్ అప్రెంటిస్‌లు
ABN , First Publish Date - 2022-11-09T14:41:06+05:30 IST
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(Airport Authority of India), రీజనల్ హెడ్‌క్వార్టర్... 2022-23 సంవత్సరానికి నార్తర్న్ రీజియన్‌లోని వివిధ విమానాశ్రయాల్లో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(Airport Authority of India), రీజనల్ హెడ్‌క్వార్టర్... 2022-23 సంవత్సరానికి నార్తర్న్ రీజియన్‌లోని వివిధ విమానాశ్రయాల్లో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ఐటీఐ ట్రేడ్(కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రికల్, మెకానిక్, ఎలక్ట్రానిక్స్)-44
అర్హత: సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ/ఎన్‌సీవీటీ సర్టిఫికెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2022 ఆగస్టు 31 నాటికి 26 సంవత్సరాలు మించకూడదు
శిక్షణ స్థానాలు/విమానాశ్రయాలు: ఆర్‌హెచ్‌క్యూ, ఎన్‌ఆర్, న్యూఢిల్లీ, ఢిల్లీ బేస్డ్ యూనిట్లు, బికనీర్, సీఏటీసీ, డెహ్రాడూన్, గోరఖ్‌పూర్, గ్వాలియర్, హిండన్, కులు, మొరాబాద్, ప్రతా్‌పగఢ్, ప్రయాగ్‌రాజ్, శ్రీనగర్, వారణాసి
ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 7
వెబ్‌సైట్: portal.mhrdnats.gov.in