IOCLలో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు
ABN , First Publish Date - 2022-11-04T16:05:16+05:30 IST
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) మార్కెటింగ్ డివిజన్... సదరన్ రీజియన్‌లో కింద పేర్కొన్న ట్రేడ్/విభాగాల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు
ఖాళీలు 265
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) మార్కెటింగ్ డివిజన్... సదరన్ రీజియన్‌లో కింద పేర్కొన్న ట్రేడ్/విభాగాల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్, డేటా ఎంట్రీ ఆపరేటర్
పని ప్రాంతాలు: తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
వయసు: 2022 అక్టోబరు 31 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి
ఎంపిక: రాత పరీక్ష, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా
పరీక్ష కేంద్రాలు: చెన్నై, కొచ్చిన్, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 12
రాత పరీక్ష తేదీ: నవంబరు 27
వెబ్‌సైట్: https://www.iocl.com/