Intelligence Bureau: సెక్యూరిటీ అసిస్టెంట్‌, ఎంటీఎస్‌ పోస్టులు

ABN , First Publish Date - 2022-11-04T13:12:48+05:30 IST

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో... దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన

Intelligence Bureau: సెక్యూరిటీ అసిస్టెంట్‌, ఎంటీఎస్‌ పోస్టులు
ఎంటీఎస్‌ పోస్టులు

ఖాళీలు 1671

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో... దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్‌: 1,521 పోస్టులు

2. మల్టీ-టాస్కింగ్‌(ఎంటీఎస్‌): 150 పోస్టులు

అర్హతలు: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణతతోపాటు స్థానిక భాషపై అవగాహన ఉండాలి.

వయోపరిమితి: 2022 నవంబరు 25 నాటికి ఎస్‌ఏ/ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 25 ఏళ్లు, ఎంటీఎస్‌ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రూ.21,700 - రూ.69,100, ఎంటీఎస్‌ పోస్టులకు రూ.18,000- రూ.56,900 చెల్లిస్తారు.

ఎంపిక: టైర్‌-1, టైర్‌-2, టైర్‌-3 పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష ఫీజు: రూ.500(ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.50)

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: నవంబరు 5

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 25

వెబ్‌సైట్‌: https://www.mha.gov.in/

Updated Date - 2022-11-04T13:13:37+05:30 IST