NTPCలో మెడికల్ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..!
ABN , First Publish Date - 2022-01-16T21:27:40+05:30 IST
న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్టీపీసీ) మెడికల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్టీపీసీ) మెడికల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 15
పోస్టులు: జనరల్ సర్జన్:08; స్పెషలిస్ట్(జనరల్ మెడిసిన్):07
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత స్పెషలైజేషన్లో మెడికల్ పీజీ డిగ్రీ(ఎండీ/డీఎన్బీ) ఉత్తీర్ణత.
జీతభత్యాలు: ఈ-4 గ్రేడ్ అభ్యర్థులకు నెలకు రూ.70,000 నుంచి రూ.2,00,000 వరకు చెల్లిస్తారు. ఈ-3 గ్రేడ్ అభ్యర్థులకు నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు లభిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 27
వెబ్సైట్: https://www.ntpc.co.in/