SBIలో అసిస్టెంట్ మేనేజర్లు
ABN , First Publish Date - 2022-02-07T18:28:45+05:30 IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం కింద పేర్కొన్న రెగ్యులర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది....

ఖాళీలు: 48
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం కింద పేర్కొన్న రెగ్యులర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్లు
విభాగాలు: నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, రూటింగ్ అండ్ స్వీచింగ్
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 2021 ఆగస్టు 31 నాటికి 40 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.36,000 నుంచి రూ.63,840 వరకు చెల్లిస్తారు
ఎంపిక: ప్రొవిడ్జనల్ నాలెడ్జ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ ఎంపిక 100 మార్కులకు ఉంటుంది. 75 శాతం మార్కులు రాత పరీక్షకు, 25 శాతం మార్కుల వెయిటేజీని ఇంటర్వ్యూకు కేటాయించారు.
పరీక్ష విధానం: దీన్ని 100 మార్కులకు ఆన్లైన్లో నిర్వహిస్తారు. 80 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి నాలుగోవంతు మార్క్ కట్ అవుతుంది.
పని ప్రదేశం: ముంబయి/బెంగళూరు/నిబంధనల ప్రకారం దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 25
ఆన్లైన్ టెస్ట్ తేదీ: మార్చి 20
వెబ్సైట్: https://sbi.co.in/web/careers# lattest