AFCAT నోటిఫికేషన్ విడుదల.. ఖాళీలెన్నంటే..!

ABN , First Publish Date - 2022-12-31T13:02:48+05:30 IST

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (Indian Air Force) - ‘ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (Air Force Common Admission Test) (ఏఎఫ్‌ క్యాట్‌) 2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌)/ ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ (NCC Special Entry)ల్లో ఖాళీలను భర్తీ

AFCAT నోటిఫికేషన్ విడుదల.. ఖాళీలెన్నంటే..!
ఖాళీలెన్నంటే..!

ఖాళీలు 258

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (Indian Air Force) - ‘ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (Air Force Common Admission Test) (ఏఎఫ్‌ క్యాట్‌) 2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌)/ ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ (NCC Special Entry)ల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. వీటికి సంబంధించిన ఎంట్రీ కోర్సులు 2024 జనవరిలో ప్రారంభమౌతాయి. ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌) బ్రాంచ్‌ల అభ్యర్థులకు 74 వారాలు; గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌ టెక్నికల్‌) బ్రాంచ్‌ అభ్యర్థులకు 52 వారాలు ఎయిర్‌ ఫోర్స్‌ ట్రెయినింగ్‌ సెంటర్ల (Air Force Training Centres)లో శిక్షణ ఇస్తారు. అవివాహిత అభ్యర్థులు(పురుషులు, మహిళలు) దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు: మొత్తం 258 ఖాళీలు ఉన్నాయి. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కింద పురుషులకు 5, మహిళలకు 5 ఖాళీలు ఉన్నాయి. వీటిలోనే ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ కింద ఖాళీలు నిర్దేశించారు. గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌) బ్రాంచ్‌లో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ అందుబాటులో ఉంది. ఇందులో ఎస్‌ఎస్‌సీ కింద పురుషులకు 117 ఖాళీలు, మహిళలకు 13 ఖాళీలు ఉన్నాయి. గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌ టెక్నికల్‌) బ్రాంచ్‌లో ఎస్‌ఎస్‌సీ(SSC) కింద ఖాళీలు ఉన్నాయి. పురుషులకు వెపన్‌ సిస్టమ్స్‌ 15, అడ్మినిస్ట్రేషన్‌ 43, ఎల్‌జీఎస్‌ 19, అకౌంట్స్‌ 11, ఎడ్యుకేషన్‌ 8, మెటియోరాలజీ 7 చొప్పున మొత్తం 103 ఖాళీలు ఉన్నాయి. మహిళలకు వెపన్‌ సిస్టమ్స్‌ 2, అడ్మినిస్ట్రేషన్‌ 5, ఎల్‌జీఎస్‌ 2, అకౌంట్స్‌ 2, ఎడ్యుకేషన్‌ 2, మెటియోరాలజీ 2 చొప్పున మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి.

అర్హత వివరాలు: ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు ఫిజిక్స్‌, మేథమెటిక్స్‌ ప్రధాన సబ్జెక్ట్‌లుగా కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌ పూర్తిచేసి ఉండాలి. ప్రథమ శ్రేణి మార్కులతో మామూలు డిగ్రీ/ ఏఎంఐఈ(సెక్షన్‌ ఎ, బి)/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 2024 జనవరి 1 నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. డీజీసీఏ నుంచి వ్యాలిడ్‌ కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్‌ ఉన్నవారిని 26 ఏళ్ల వరకు అనుమతిస్తారు. అభ్యర్థుల ఎత్తు కనీసం 162.5 సెం.మీలు ఉండాలి.

  • గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌) బ్రాంచ్‌కు ఫిజిక్స్‌, మేథమెటిక్స్‌ ప్రధాన సబ్జెక్ట్‌లుగా కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌ పూర్తిచేసి ఉండాలి. ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ (ఎలక్ట్రానిక్స్‌/ మెకానికల్‌) సంబంధిత విభాగాల్లో ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ ఉత్తీర్ణులై ఉండాలి.

  • గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌ టెక్నికల్‌) బ్రాంచ్‌లో వెపన్‌ సిస్టమ్స్‌కు 50 శాతం మార్కులతో ఇంటర్‌(మేథ్స్‌, ఫిజిక్స్‌) ఉత్తీర్ణతతోపాటు ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/ బీటెక్‌/ ఏదేని మామూలు డిగ్రీ పూర్తిచేసినవారు; అడ్మినిస్ట్రేషన్‌, లాజిస్టిక్స్‌ విభాగాలకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు; అకౌంట్స్‌కు కనీసం 60 శాతం మార్కులతో బీకాం/ సీఏ/ సీఎంఏ/ సీఎస్‌/ సీఎ్‌ఫఏ లేదా ఫైనాన్స్‌ ప్రధాన సబ్జెక్ట్‌గా బీఎస్సీ/ బీబీఏ/ బీఎంఎస్‌/ బీబీఎస్‌ ఉత్తీర్ణులు; ఎడ్యుకేషన్‌కు కనీసం 50 శాతం మార్కులతో పీజీ/ కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులు; మెటియోరాలజీకి ప్రథమ శ్రేణి మార్కులతో బీఎస్సీ(ఫిజిక్స్‌, మేథమెటిక్స్‌)/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ అభ్యర్థులందరికీ వయసు 2024 జనవరి 1 నాటికి 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ కింద అప్లయ్‌ చేసుకొనేవారికి ఎన్‌సీసీ ఎయిర్‌ వింగ్‌ సీనియర్‌ డివిజన్‌ సీ సర్టిఫికెట్‌ ఉండాలి. వీరికి రిటెన్‌ ఎగ్జామ్‌ నుంచి మినహాయింపు వర్తిస్తుంది. వీరిని నేరుగా ఏఎఫ్‌ఎస్‌బీ టెస్టింగ్‌కు పిలుస్తారు.

ఏఎఫ్‌ క్యాట్‌ 2023 వివరాలు: పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్‌ ఎగ్జామ్‌. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌, వెర్బల్‌ ఎబిలిటీ ఇన్‌ ఇంగ్లీష్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, మిలిటరీ ఆప్టిట్యూడ్‌ అంశాలనుంచి మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. న్యూమరికల్‌ ఎబిలిటీ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. మిగతా ప్రశ్నలన్నీ డిగ్రీ స్థాయిలో ఉంటాయి. ప్రశ్నలను ఆంగ్ల మాధ్యమంలో ఇస్తారు. ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున మొత్తం మార్కులు 300. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. ఆన్‌లైన్‌ టెస్ట్‌లో అర్హత పొందిన వారిని ఎయిర్‌ఫోర్స్‌ సెలెక్షన్‌ బోర్డు(ఏఎఫ్‌ఎస్‌బీ) నిర్వహించే స్టేజ్‌-1, స్టేజ్‌-2, సీపీఎ్‌సఎస్‌ టెస్ట్‌లకు పిలుస్తారు. ఈ పరీక్షలన్నింటిలో అర్హత సాధించిన వారికి మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహించి ట్రెయినింగ్‌కు పంపుతారు.

స్టయిపెండ్‌: ట్రెయినింగ్‌ సమయంలో నెలకు రూ.56,100లు చెల్లిస్తారు.

పరీక్ష ఫీజు: రూ.250

ఏఎఫ్‌ క్యాట్‌ 2023 అడ్మిట్‌ కార్డ్‌ల డౌన్‌లోడింగ్‌: 2023 ఫిబ్రవరి 8 నుంచి

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం

ఏఎఫ్‌ క్యాట్‌ తేదీలు: 2023 ఫిబ్రవరి 24, 25, 26

వెబ్‌సైట్‌: https://afcat.cdac.in

Updated Date - 2022-12-31T13:02:49+05:30 IST