SAILలో ఉద్యోగాలు.. జీతమెంతంటే...

ABN , First Publish Date - 2022-11-28T18:24:23+05:30 IST

భిలాయ్‌లోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

SAILలో ఉద్యోగాలు.. జీతమెంతంటే...
SAILలో ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు 259

భిలాయ్‌లోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌, మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, మైనింగ్‌ మేట్‌, ఓసీటీ ట్రెయినీ తదితరాలు

విభాగాలు: హైడ్రాలిక్స్‌ మెయింటెనెన్స్‌, జనరల్‌ మెడిసిన్‌, సైకియాట్రి, ఈఎన్‌టీ, ఎలక్ట్రికల్‌, కెమికల్‌ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌/డిప్లొమా/ఐటీఐ/బీఈ/బీటెక్‌/ఎంబీబీఎ్‌స/డీఎం/డీఎన్‌బీ/ఎంసీహెచ్‌/పీజీ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: పోస్టును అనుసరించి 28 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.25070-రూ.2.5 లక్షలు చెల్లిస్తారు

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ/స్కిల్‌ టెస్ట్‌/ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.700

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబరు 26

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 17

వెబ్‌సైట్‌: https://sailcareers.com

Updated Date - 2022-11-28T18:24:24+05:30 IST