కాళోజీ వర్సిటీలో డెంటల్‌ పీజీ

ABN , First Publish Date - 2022-10-25T15:20:44+05:30 IST

వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌) - ఎండీఎస్‌ ప్రోగ్రామ్‌లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కాళోజీ వర్సిటీలో  డెంటల్‌ పీజీ

వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌) - ఎండీఎస్‌ ప్రోగ్రామ్‌లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆర్మీ డెంటల్‌ కాలేజ్‌ సహా తెలంగాణలోని అనుబంధ ప్రైవేట్‌ డెంటల్‌ కళాశాలల్లో అడ్మిషన్స్‌ నిర్వహిస్తారు. నీట్‌ ఎండీఎస్‌ 2022 స్కోర్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి అర్హులకు ప్రవేశాలు కల్పిస్తారు. సీట్ల వివరాలను వెబ్‌ ఆప్షన్స్‌ సమయంలో ప్రకటిస్తారు. ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు.

అర్హత: డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీడీఎస్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. జూలై 31 నాటికి ఇంటర్న్‌షిప్‌ పూర్తయి ఉండాలి. నీట్‌ ఎండీఎస్‌ 2022లో జనరల్‌ అభ్యర్థులకు 174; బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 138; జనరల్‌ కేటగిరీ దివ్యాంగులకు 157ను కటాఫ్‌ స్కోర్‌గా నిర్దేశించారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివినవారు పర్మనెంట్‌ డెంటల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ సబ్మిట్‌ చేయాలి. ఎన్‌ఆర్‌ఐల బంధువులు ఎన్‌ఆర్‌ఐ కోటా కింద అప్లయ్‌ చేసుకోవచ్చు. వీరు సంబంధిత ఎన్‌ఆర్‌ఐ నుంచి స్పాన్సర్‌షిప్‌ సర్టిఫికెట్‌, స్టాటస్‌ సర్టిఫికెట్‌, బ్యాంక్‌ అకౌంట్‌ పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ సబ్మిట్‌ చేయాలి. ఇన్‌స్టిట్యూషనల్‌ కోటా కింద అప్లయ్‌ చేసుకొనేవారు కాలేజ్‌ నుంచి స్పాన్సర్‌షిప్‌ సర్టిఫికెట్‌ జతచేయాలి. ఆర్మీ డెంటల్‌ కాలేజ్‌లోని సీట్లను ఆర్మీ అధికారుల పిల్లలకు ప్రత్యేకించారు.

ముఖ్య సమాచారం

రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు: రూ.6,300

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 23

దరఖాస్తుతోపాటు అప్‌లోడ్‌ చేయాల్సిన పత్రాలు: నీట్‌ ఎండీఎస్‌ 2022 అడ్మిట్‌ కార్డ్‌, నీట్‌ ఎండీఎస్‌ 2022 స్కోర్‌ కార్డ్‌, బీడీఎస్‌ డిగ్రీ సర్టిఫికెట్‌, బీడీఎస్‌ స్టడీ సర్టిఫికెట్‌, రొటేటరీ ఇంటర్న్‌షిప్‌ సర్టిఫికెట్‌; కులం, ఆదాయం, వైకల్యం ధ్రువీకరణ పత్రాలు

దరఖాస్తు లింక్‌: https://pvttsmds.tsche.in/

వెబ్‌సైట్‌: knruhs.telangana.gov.in

Updated Date - 2022-10-25T15:20:45+05:30 IST