NACSలో సైబర్ సెక్యూరిటీ కోర్సులు
ABN , First Publish Date - 2022-10-25T15:29:10+05:30 IST
హైదరాబాద్ - మణికొండలో భారత్ సేవ సెంటర్ ఎల్‌ఎల్‌పీ నిర్వహిస్తున్న నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ (ఎన్‌ఏసీఎస్) - సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ప్రవేశానికి
హైదరాబాద్ - మణికొండలో భారత్ సేవ సెంటర్ ఎల్‌ఎల్‌పీ నిర్వహిస్తున్న నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ(ఎన్‌ఏసీఎస్) - సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. వీటికి నేషనల్ కంప్యూటింగ్ కౌన్సిల్(ఎన్‌సీసీఐ), అవాంజొ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సహకారం అందిస్తున్నాయి. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. సంస్థ నిబంధనల మేరకు అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తారు.
కోర్సులు
సర్టిఫికెట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ
సర్టిఫికెట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్
సైబర్ సెక్యూరిటీ టీచర్స్ ట్రెయినింగ్
డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్
పోస్ట్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 27
చిరునామా: 403 శ్రీనిలయం, ల్యాంకోహిల్స్ రోడ్, మణికొండ, హైదరాబాద్ - 500089
ఫోన్ నెం: +917893141797
వెబ్‌సైట్: www.nacsindia.org