నిరుద్యోగుల కోసం ‘ఎయింకాం’ యాప్‌

ABN , First Publish Date - 2022-10-28T15:43:26+05:30 IST

కేవలం అర్హతతోనే ఇంటర్వ్యూల్లో విజయం సాధ్యం కాదు. అందుకు ముందస్తు ప్రిపరేషన్‌ ఎంతో ఉండాలి. ప్రవర్తన

నిరుద్యోగుల కోసం ‘ఎయింకాం’ యాప్‌

కేవలం అర్హతతోనే ఇంటర్వ్యూల్లో విజయం సాధ్యం కాదు. అందుకు ముందస్తు ప్రిపరేషన్‌ ఎంతో ఉండాలి. ప్రవర్తన మొదలుకుని సమాధానాలు ఇచ్చే విధానం వరకు అన్నీ ఇంటర్వ్యూలో ఇతోధిక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో పాల్గొనే విద్యార్థుల్లో ఎక్కువ మంది ప్రాథమికాంశాలపై అవగాహన లేక వైఫల్యం చెందుతున్నారు. దాంతో నిరాశ, నిస్పృహలు వారిని ఆవరిస్తున్నాయి. ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రమఖ వ్యక్తిత్వవికాస నిపుణుడు చల్లా రామఫణి ‘ఎయింకాం’ (aimkaam) యాప్‌తో ముందుకు వచ్చారు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి దీనిని డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యార్థులు, నిరుద్యోగులు ప్రయోజనం పొందవచ్చని ఆయన తెలిపారు.

Updated Date - 2022-10-28T15:43:27+05:30 IST