DRDO-ADEలో అప్రెంటిస్‌లు

ABN , First Publish Date - 2022-07-27T20:35:20+05:30 IST

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరు(Bangalore)లోని డీఆర్‌డీఓ-ఏరోనాటికల్‌ డెవల్‌పమెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(Aeronautical Development Establishment)(ఏడీఈ) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అప్రెంటిస్‌ల వారీగా ఖాళీలు

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీలు: 11

విభాగాలు/సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత

స్టయిపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

2. టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు:18

విభాగాలు/సబ్జెక్టులు: మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలకా్ట్రనిక్స్‌ 

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణత.

స్టయిపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు

3. ట్రేడ్‌ అప్రెంటిస్‌ ట్రెయినీలు(ఐటీఐ): 22

ట్రేడులు: ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, కోపా, వెల్డర్‌, టర్నర్‌ తదితరాలు

అర్హత: సంబంధిత విభాగాల్లో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్‌ ద్వారా సమాచారం అందిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా 

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 31

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/

Updated Date - 2022-07-27T20:35:20+05:30 IST