Posts: ప్రభుత్వ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌

ABN , First Publish Date - 2022-11-09T14:08:56+05:30 IST

వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌ పోస్టుల(Specialist Officers Posts) భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(Institute of Banking Personnel Selection)(ఐబీపీఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది

Posts: ప్రభుత్వ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌
స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌

వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌ పోస్టుల(Specialist Officers Posts) భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(Institute of Banking Personnel Selection)(ఐబీపీఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్న వారు నవంబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌.

పోస్టులు

అర్హతలు: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ఎలకా్ట్రనిక్స్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్స్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌). డిగ్రీ(అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌/యానిమల్‌ హస్బెండరీ/వెటర్నరీ సైన్స్‌/డెయిరీ సైన్స్‌/షిషరీ సైన్స్‌/పిసి కల్చర్‌/అగ్రి మార్కెటింగ్‌ అండ్‌ కో ఆపరేషన్‌/కో ఆపరేషన్‌ అండ్‌ బ్యాంకింగ్‌/ఆగ్రో-ఫారెస్ట్రీ/ఫారెస్ట్రీ/అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ/ఫుడ్‌ సైన్స్‌/అగ్రికల్చర్‌ టెక్నాలజీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/డెయిరీ టెక్నాలజీ/అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌/సెరికల్చర్‌). పీజీ(ఎలకా్ట్రనిక్స్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌). పీజీ(హిందీ/సంస్కృతం). డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ), పీజీ(పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌/ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌/హెచ్‌ఆర్‌/హెచ్‌ఆర్‌డీ/సోషల్‌ వర్క్‌/లేబర్‌ లా). ఎంఎంఎస్(మార్కెటింగ్‌)/ఎంబీఏ(మార్కెటింగ్‌)/పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీపీఎం/పీజీడీఎం.

వయోపరిమితి: 2022 నవంబరు 1 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, చీరాల, చిత్తూరు, గుం టూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 21

అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌(ప్రిలిమినరీ పరీక్ష): 2022 డిసెంబరు

ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2022 డిసెంబరు 24, డిసెంబరు 31

ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: 2023 జనవరి

ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌: 2023 జనవరి

ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష తేదీ: 2023 జనవరి 29

తుది పరీక్ష ఫలితాల ప్రకటన: 2023 ఫిబ్రవరి

ఇంటర్వ్యూ కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌: 2023 ఫిబ్రవరి

ఇంటర్వ్యూ నిర్వహణ: 2023 ఫిబ్రవరి/మార్చి

ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌: 2023 ఏప్రిల్‌

వెబ్‌సైట్‌: https://www.ibps.in/

posts.gif

Updated Date - 2022-11-09T15:33:25+05:30 IST