భారతదేశం-నదీ వ్యవస్థ! పోటీ పరీక్షల ప్రత్యేకం!

ABN , First Publish Date - 2022-08-03T20:26:11+05:30 IST

నదుల(rivers) గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పొటమాలజీ’ అని అంటారు. ఏటా మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని(World Water Day) నిర్వహిస్తారు. సెప్టెంబరు చివరి ఆదివారం ప్రపంచ నదుల దినోత్సవాన్ని జరుపకొంటారు.

భారతదేశం-నదీ వ్యవస్థ! పోటీ పరీక్షల ప్రత్యేకం!

నదుల(rivers) గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పొటమాలజీ’ అని అంటారు. ఏటా మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని(World Water Day) నిర్వహిస్తారు. సెప్టెంబరు చివరి ఆదివారం ప్రపంచ నదుల దినోత్సవాన్ని జరుపకొంటారు.


ప్రపంచ నీటి దినోత్సవ థీమ్‌లు


2018: Nature of Water

2019: Leaving No One Behind

2020: Water and Climate Change

2021: Valuing Water

2022: Ground Water: Making the invisible


నదీ పరివాహక ప్రాంతం: ఒక నదికి ఏ ప్రాంతాల నీరు నుంచి వచ్చి చేరుతుందో ఆ ప్రాంతాల మొత్తం వైశాల్యాన్ని ఆ నది పరివాహక ప్రాంతంగా పేర్కొంటారు. పరివాహక  ప్రాంతం ఆధారంగా నదులను మూడు రకాలుగా విభజించారు. అవి..

 

ప్రధాన నదులు: 20,000 చ.కి.మీ. లేదా అంతకంటే ఎక్కువ పరివాహక ప్రాంతాన్ని కలిగిన నదులను ప్రధాన నదులుగా పేర్కొంటారు. ఇవి భారతదేశంలో 14 ఉన్నాయి. అవి..గంగా, సింధూ, బ్రహ్మపుత్ర, నర్మదా, తపతి, సబర్మతి, మహీ, సువర్ణరేఖ, బ్రహ్మణి, మహానది, గోదావరి, కృష్ణా, కావేరీ, పెన్నా. భారతదేశంలోని మొత్తం నదుల ద్వారా ప్రవహించే నీటిలో 85 శాతం నీరు వీటి ద్వారానే ప్రవహిస్తుంది. 


మధ్య తరహా నదులు: 2000 - 20,000 చ.కి.మీ మధ్య పరివాహక ప్రాంతాన్ని కలిగిన నదులను మధ్య తరహా నదులుగా పేర్కొంటారు. ఇవి 44 ఉన్నాయి. వీటి ద్వారా 7 శాతం నీరు ప్రవహిస్తుంది.


చిన్న తరహా నదులు: 2000 చ.కి.మీ.కంటే తక్కువ పరివాహక ప్రాంతాన్ని కలిగిన నదులను చిన్న తరహా నదులుగా పేర్కొంటారు. ఇవి సుమారు 187 ఉన్నట్లుగా భారత ప్రభుత్వం గుర్తించింది. వీటి ద్వారా 8 శాతం నీరు ప్రవహిస్తుంది.


  • భారతదేశంలోని నదులను వాటి పుట్టుక ఆధారంగా రెండు ప్రధాన వ్యవస్థలుగా విభజించారు. 

హిమాలయ నదీ వ్యవస్థ

హిమాలయాల్లో పుట్టి భారతదేశం గుండా ప్రయాణించేవి. హిమాలయ నదులను రెండుగా విభజించారు. అవి..


పూర్వపర్తి నదులు: హిమాలయాలు ఏర్పడక ముందు నుంచి ఆ ప్రాంతంలో ప్రవహించే నదులను ‘పూర్వపర్తి నదులు’ అంటారు. అవి..సింధూ, సట్లెజ్‌, బ్రహ్మపుత్ర, అలకనంద, గండక్‌, కోసి


అంతర్వర్తిత నదులు: హిమాలయాలు ఏర్పడిన తరువాత అక్కడ పుట్టి ప్రవహించే నదులను ’అంతర్వర్తిత’ నదులు అంటారు.

ఉదాహరణ: గంగ, యమున, జీలం, చీనాబ్‌, రావి, బియాస్‌, గగ్రా, రామ్‌ గంగ మొదలైనవి


హిమాలయ నదుల లక్షణాలు: ఇవి జీవనదులు. వీటిలో 365 రోజులు నీరు ప్రవహిస్తుంది. వేసవిలో మంచు కరిగి నీరు ప్రవహిస్తుంది. వర్షాకాలంలో వర్షాల వలన నీరు ప్రవహిస్తుంది. పర్వతాలపై నుంచి ప్రవహించడం వలన వీటి వేగం అధికంగా ఉంటుంది. వీటివలన అకస్మాత్తుగా వరదలు సంభవిస్తాయి. ఇవి వెడల్పు తక్కువగా ఉండి, లోతు ఎక్కువగా ఉండే ‘వి’ ఆకారపు లోయను ఏర్పాటు చేస్తాయి.


ద్వీపకల్ప నదీ వ్యవస్థ: ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంలో పుట్టి ప్రవహించే నదులను ద్వీపకల్ప నదులుగా పేర్కొంటారు. ఇవి అజీవ నదులు. వర్షాధారిత లేదా రుతుపవన ఆధారంగా ప్రవహిస్తుంటాయి. ఇవి పీఠభూములు, మైదాన ప్రాంతాల మీద ప్రవహించడం వలన వీటి వేగం తక్కువగా ఉంటుంది. ఇవి అత్యంత వెడల్పైన, లోతు తక్కువగా ఉన్న లోయలను ఏర్పాటు చేస్తాయి.


సింధూ నదీ వ్యవస్థ

దీనిని ఆంగ్లంలో ఇండస్‌ అని, లాటిన్‌లో సింథస్‌ అని, పర్షియన్‌లో సింథోమ్‌ అని గ్రీకు భాషలో సింథోస్‌ అని, టిబెట్‌ భాషలో సింగి కంభట్‌ అని సంస్కృతంలో సింధూ అని పిలుస్తారు. సింధూ నది జన్మస్థానం గుర్తాంగ్‌ చు. ఇది టిబెట్‌లోని కైలాస పర్వతాలలోని ‘మానస సరోవరం’ సరస్సుకు పశ్చిమాన జన్మిస్తుంది. టిబెట్‌, ఇండియా, పాకిస్థాన్‌ దేశాల్లో ప్రవహిస్తుంది.


భారతదేశంలోకి ప్రవేశించే ప్రాంతం: థాంచోక్‌

  • భారతదేశంలో లద్దాఖ్‌ గుండా మాత్రమే ప్రవహిస్తుంది.
  • లద్దాఖ్‌లోని ట్రాన్స్‌ హిమాలయాలలోని, లద్దాఖ్‌- జస్కర్‌ పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది.
  • ఇది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్‌ - బాల్కిస్థాన్‌ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.
  • పాకిస్థాన్‌లోని తల్బల అనే ప్రాంతం వద్ద తొలిసారిగా మైదానంలోకి ప్రవేశిస్తుంది.
  • సింధూ నదీ పరివాహక ప్రాంతం: 11,65,000 చ.కి.మీ.
  • భారతదేశంలో సింధూ పరివాహక ప్రాంతం: 3,21,290 చ.కి.మీ.
  • సింధూ నది పరివాహక ప్రాంతం కలిగిన దేశాలు: టిబెట్‌ - ఇండియా - ఆఫ్ఘానిస్థాన్‌- పాకిస్థాన్‌
  • ఇది పాకిస్థాన్‌లో థార్‌ ఎడారి గుండా ప్రవహిస్తుంది
  • అందువల్ల దీనిని పరస్థానీయ నది అని పిలుస్తారు
  • నీటి లభ్యత అధికంగా ఉండే ప్రాంతాల్లో జన్మించి ఎడారుల గుండా ప్రవహించే నదులను పరస్థానీయ నదులు(Exotic Rivers) అంటారు. 

ప్రపంచంలో ముఖ్యమైన Exotic Rivers

నైలు నది: సహారా ఎడారి - ఆఫ్రికా. ఇది విక్టోరియా సరస్సులో జన్మిస్తుంది. ఇది రెండు నదుల కలయిక వలన ఏర్పడుతుంది. 

1. వైట్‌ నైల్‌: విక్టోరియా సరస్సు(టాంజానియా)

2. బ్లూ నైల్‌: థానా సరస్సు(ఇథియోపియా)

ప్రపంచంలో అత్యంత పొడవైన నది: 6670 కి.మీ.

ఈజిప్టులోని అలెగ్జాండ్రియా వద్ద మధ్యధరా సముద్రంలో కలుస్తుంది.

కొలరాడో నది: ఇది అమెరికాలోని ‘సోనారన్‌ ఎడారి’ గుండా ప్రవహిస్తుంది. కొలరాడో పీఠభూమిలో జన్మిస్తుంది. దీని పరివాహక ప్రాంతంలో పత్తి పంట అధికంగా పండుతుంది. ప్రపంచంలో అతిపెద్దదైన ‘అగాధ ధరి’ని ఏర్పరస్తుంది. దీన్ని ‘ద గ్రాండ్‌ కానాన్‌’ అని పిలుస్తారు. దీని లోయ 2 కి.మీ.లోతు, 482 కి.మీ. పొడవు ఉంటుంది. దీనిని ‘మదర్‌ ఆఫ్‌ రివర్స్‌’ అని పిలుస్తారు.

ఆరెంజ్‌ నది: ఇది దక్షిణ ఆఫ్రికాలో ‘కలహారి ఏడారి’ గుండా ప్రవహిస్తుంది. డ్రాకేన్స్‌ బర్గ్‌ పర్వతాలలో జన్మిస్తుంది. కలహారి ఎడారి ప్రపంచంలో అతిపెద్ద హమ్మదా ఏడారి. దక్షిణ ఆఫ్రికా - నమీబియా దేశాల సరిహద్దుగా ప్రవహిస్తుంది.

డార్లింగ్‌ నది: ఇది ఆస్ట్రేలియా పశ్చిమ భాగాన ఉన్న ‘ద గ్రేట్‌ విక్టోరియా ఏడారి’ గుండా ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డున ‘సిడ్నీ’ నగరం ఉంది. సిడ్నీ ఆస్ట్రేలియాలో జనాభాపరంగా అతి పెద్దది.

  • సింధూ ముఖద్వారం(నది సముద్రంలో కలిసే ప్రాంతం): కరాచి(పాకిస్థాన్‌)
  • సింధూ నదిపై జమ్మూ కశ్మీర్‌లోని ప్రాజెక్టు: చుటక్‌
  • పాకిస్థాన్‌లో అతిపెద్ద నది: సింధూ
  • పాకిస్థాన్‌ జీవన రేఖ: సింధూ నది

-వి. వెంకటరెడ్డి, 

సీనియర్‌ ఫ్యాకల్టీ



Updated Date - 2022-08-03T20:26:11+05:30 IST