పొరుగు దేశాలతో భారత్ సరిహద్దులేంటి? పోటీ పరీక్షల కోసం!
ABN , First Publish Date - 2022-07-18T21:38:02+05:30 IST
నేపాల్‌తో సరిహద్దును పంచుకునే భారతీయ రాష్ట్రాలు: సిక్కిం, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్
భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమరిక
పాకిస్థాన్(3323 కి.మీ.)
- పాక్‌తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు - గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, లడ్డాఖ్, జమ్మూ కశ్మీర్
- పాకిస్థాన్‌తో అత్యధిక సరిహద్దును పంచు కుంటున్న రాష్ట్రం - రాజస్థాన్(1170 కి.మీ.)
- పాకిస్థాన్‌తో తక్కువ సరిహద్దు పంచుకుం టున్న రాష్ట్రం - పంజాబ్(425 కి.మీ.)
- ఇండియా- పాకిస్థాన్‌లను వేరుచేసే సరిహద్దు విభజన రేఖ: సర్ రాడ్ క్లిఫ్ రేఖ- దీనిని 1947 భారత స్వాతంత్య్ర చట్టం ప్రకారం(లేదా) జాన్-3 ప్రణాళికా ప్రకారం(లేదా) డిక్కీ బర్డ్ ప్రణాళిక(లేదా) మౌంట్ బాటన్ ప్రణాళికా ప్రకారం ఏర్పాటు చేశారు.
- పాకిస్థాన్ - గుజరాత్‌లను వేరు చేసే విభజన రేఖ - 240 సమాంతర రేఖ(పాకిస్థాన్ 1948లో ఏర్పాటు చేసింది. దీనిని ఇండియా గుర్తించడం లేదు)
జమ్మూ కశ్మీర్‌లో సరిహద్దు రేఖలు
1. అంతర్జాతీయ సరిహద్దు రేఖ - పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్థాన్‌ను వేరు చేస్తుంది.
2. ఎల్‌ఓసీ(లైన్ ఆఫ్ కంట్రోల్)- పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్థాన్‌ను వేరు చేస్తుంది.
3. ఏజీపీఎల్(యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్)- పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను లడ్డాఖ్‌ను వేరు చేస్తుంది.
- ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో వివాదాస్పద ప్రాంతం- సియాచిన్
- సియాచిన్‌ను కాపాడేందుకు 1984లో ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్: ఆపరేషన్ మేఘధూత్
- ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రం- సియాచిన్
- సియాచిన్ హిమానీనదం వద్ద భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుగా ఉన్న పర్వతాలు- సాల్తోరా పర్వతాలు
- ఇండియా - పాకిస్థాన్‌ల మధ్య గుజరాత్‌లో వివాదాస్పద ప్రాంతాలు: రాన్ ఆఫ్ కచ్, సర్ క్రీక్
- రాన్ ఆఫ్ కచ్: ఉప్పుతో కూడిన చిత్తడి నేలలు. దీని మొత్తం వైశాల్యం 9000 చదరపు కి.మీ. ఇందులో 800 చ.కి.మీ. భూభాగాన్ని 1948లో పాకిస్థాన్ ఆక్రమించింది.
- సర్ క్రీక్: గుజరాత్ వద్ద అరేబియా సముద్రంలోని ఉమ్మడి జలాలైన ‘షాలో జలాల్లో’ ఉన్న పొడవైన సన్నని జల భాగాలను క్రీక్ అని పిలుస్తారు. ఉదా: కోరి క్రీక్(ఇండియా), ఖజార్ క్రీక్(పాక్), సర్ క్రీక్ అందులో అతిపెద్దది. దీని గుండా 240 సమాంతర రేఖ వేళ్తుంది. దీనిని 2012లో ఇరు దేశాలు చెరిసమానంగా పంచుకున్నాయి.
- షాలో జలాలు: సముద్రంలోని 6 మీ. లోతు కలిగిన ప్రాంతాన్ని షాలో జలాలు అంటారు.
ఆఫ్ఘానిస్థాన్(106 కి.మీ.)
- ఆఫ్ఘానిస్థాన్‌తో సరిహద్దును పంచుకునే భారతీయ ప్రాంతం: లడ్డాఖ్
- ఇండియా - ఆఫ్ఘానిస్థాన్‌ను వేరుచేసే విభజన రేఖ - డ్యూరాండ్ రేఖ. దీనిని 1893లో ల్యాండ్స్ డౌన్ కాలంలో గీశారు. ఇది పాకిస్థాన్ - ఆఫ్ఘానిస్థాన్‌లను కూడా వేరు చేస్తుంది.
- మనదేశంతో అతి తక్కువ సరిహద్దును కలిగిన దేశం
- ఆఫ్ఘానిస్థాన్‌లోని హరి నదిపై సల్మా ప్రాజెక్టును భారతదేశం నిర్మించింది. దీనినే ‘ఫ్రెండ్‌షిప్ డ్యామ్’ అని పిలుస్తారు. 2016లో నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించారు.
- చబహర్ పోర్ట్ ఒప్పందం: 2016లో ఇండియా - ఇరాన్ - ఆఫ్ఘానిస్థాన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది.
- ‘చబహర్ ఓడరేవు’ ఇరాన్‌లో ఉంది. దీనిని భారత్ లీజుకు తీసుకొని అభివృద్ధి చేస్తోంది. ఇది ఇండియాకు రక్షణపరంగా అత్యంత వ్యూహాత్మకమైనది. చైనా పాకిస్థాన్‌లో లీజుకు తీసుకున్న ఓడరేవు: గ్వాదర్
- చైనా గ్వాదర్ ఓడరేవు నుంచి పాకిస్థాన్ పీఓకే మీదుగా CPEC(China Pakistan Economic Corridor)ను ఏర్పాటు చేస్తుంది. దీనిని ఇండియా వ్యతిరేకిస్తుంది.
చైనా(3488 కి.మీ.)
- చైనాతో సరిహద్దును పంచుకునే భారతీయ ప్రాంతాలు: లడ్డాఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్
- చైనాతో అధిక సరిహద్దు పంచుకుంటున్న కేంద్ర పాలిత ప్రాంతం- లడ్డాఖ్
- చైనాతో అధిక సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం- అరుణాచల్ ప్రదేశ్
- చైనాతో తక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం- సిక్కిం
- భారత్, చైనాల సరిహద్దును 3 సెక్టార్లుగా విభజించారు
1. పశ్చిమ సెక్టార్(Western Sector): భారత్‌లోని లడ్డాఖ్‌కు, చైనాలోని సికియాంగ్ ప్రావీన్స్‌కు మధ్య ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ చైనా ఆక్రమించుకున్న భూభాగం పేరు- ఆక్సాయ్ చీన్(లాధాఖ్), ఇక్కడ ఉన్న సరిహద్దు రేఖ - Line of Actual Control(LOAC)/ వాస్తవాధీన రేఖ. ఇక్కడ చైనా 38,000 చ.కీ.మీ. భూభాగాన్ని ఆక్రమించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ 5180 చ.కి.మీ. భూభాగాన్ని, 1963లో చైనా - పాకిస్థాన్ మధ్య జరిగిన ఒప్పందం మేరకు అక్రమంగా పొందింది. దీనిని చైనా సీడెడ్ కశ్మీర్ అని పిలుస్తారు.
2. మధ్య సెక్టార్(Middle Sector):చైనాలోని టిబెట్ ప్రాంతానికి, భార్‌లోని ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల మధ్య ఈ ప్రాంతం ఉంది.
3. తూర్పు సెక్టార్(Eastern Sector):చైనాలోని టిబెట్ ప్రావిన్స్‌కు భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌కు మధ్య ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ చైనా ఆక్రమించుకున్న భూభాగం పేరు - సమత్ జంగ్. ఈ ప్రదేశంలో భారత్, చైనా మధ్యగల సరిహద్దు రేఖ- మెక్ మోహన్ రేఖ(1914లో గీశారు). చైనా మెక్‌మోహన్ రేఖను అంగీకరించడం లేదు.
ఇండియా - చైనా మధ్య 1954లో పంచశీల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో ప్రధానమైన అంశాలు...
ఎ) ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వ అధికారాలను పరస్పరం గౌరవించుకోవాలి
బి) పరస్పరం దురాక్రమనకు పాల్పడకూడదు
సి) పరస్పరం ఒకరి అంతరంగిక విషయాల్లో మరొకరు కల్పించుకోకూడదు
డి) అంతర్జాతీయ వేదికల మీద ఒకరికి ఒకరు సహకరించుకోవాలి
ఇ) అంతర్జాతీయ వ్యాపారంలో ఒకరికొకరు సహకరించుకోవాలి
- ఇండియా - చైనా మధ్య 1962లో యుద్ధం జరిగింది.
నేపాల్(1751 కి.మీ.)
- నేపాల్‌తో సరిహద్దును పంచుకునే భారతీయ రాష్ట్రాలు: సిక్కిం, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్
- నేపాల్‌తో అధిక సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్, బిహార్
- నేపాల్‌తో తక్కువ సరిహద్దును పంచుకుం టున్న రాష్ట్రం- పశ్చిమ బెంగాల్(96 కి.మీ.)
- ఇండియా - నేపాల్ మధ్య ఇటీవల వివాదాస్పదంగా మారిన ప్రాంతాలు: కాలాపానీ, లిపులేఖి, లింపియదుర
- 2015లో నేపాల్‌కు కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగా 2020లో నేపాల్ కొత్త మ్యాప్‌లను విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో భారత భూభాగానికి చెందిన పై మూడు ప్రాంతాలను నేపాల్ తమవిగా పేర్కొన్నది.
- 1816లో ఇండియా - నేపాల్ - బ్రిటిష్ మధ్య ‘సుగౌలీ’ అనే సరిహద్దు ఒప్పందం కుదిరింది.
- ఈ ఒప్పందం ప్రకారం ఇండియా - నేపాల్ మధ్య కాళీ నదిని సరిహద్దుగా గుర్తించారు.
- ఈ ఒప్పందం ప్రకారం గూర్ఖాలను మన సైన్యంలోకి తీసుకుంటున్నారు.
భూటాన్(699 కి.మీ.)
- భూటాన్‌తో సరిహద్దు పంచుకునే భారతీయ రాష్ట్రాలు: అరుణాచల్‌ప్రదేశ్, అసోం, సిక్కిం, పశ్చిమ బెంగాల్
- భూటాన్‌తో అధిక సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం - అసోం
- భూటాన్‌తో తక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం - సిక్కిం
- డోక్లాం వివాదం: ఇండియా - చైనాల మధ్య 2017లో జూన్ 16 నుంచి 28 ఆగస్టు వరకు కొనసాగింది. డోక్లాం పీఠభూమి భూటాన్‌లో ఉంది. ఈ ప్రాంతంలో చైనా రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించడంతో గొడవ మొదలైంది. ఇక్కడ చైనా ప్రవేశంతో భారత సార్వభౌమత్వానికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది. డోక్లాం పీఠభూమి పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి(చికెన్ నెక్- కోడి మెడ) ప్రాంతానికి దగ్గరగా ఉంది. సిలిగురి ప్రాంతం 22 కి.మీ. వెడల్పు కలిగి ఉంది. ఈ ప్రాంతం మీద చైనా పట్టు సాధిస్తే ఈశాన్య రాష్ట్రాలతో మన దేశానికి రోడ్డు కనెక్టివిటీ తెగిపోతుంది.
-వి.వెంకటరెడ్డి,
సీనియర్ ఫ్యాకల్టీ
