Exams Special: క్షమాభిక్ష రకాలు.. పోటీ పరీక్షల కోసం..

ABN , First Publish Date - 2022-11-21T17:23:07+05:30 IST

పార్డన్‌: దీనిద్వారా నేరస్థునికి శిక్ష నుంచి పూర్తి మినహాయింపును కల్పిస్తారు 2) కమ్యూటేషన్‌: దీనిలో శిక్ష స్వభావాన్ని మారుస్తారు. కానీ శిక్షకాలం తగ్గించడం జరగదు. ఉదాహరణకు ఆరేళ్ల కఠిన కారాగార శిక్షను ఆరు సంవత్సరాల సాధారణ శిక్షగా మార్చడం.

Exams Special: క్షమాభిక్ష రకాలు.. పోటీ పరీక్షల కోసం..
పోటీ పరీక్షల కోసం..

ఇండియన్‌ పాలిటిక్స్..

రాష్ట్రపతి

క్షమాభిక్ష రకాలు

1) పార్డన్‌: దీనిద్వారా నేరస్థునికి శిక్ష నుంచి పూర్తి మినహాయింపును కల్పిస్తారు 2) కమ్యూటేషన్‌: దీనిలో శిక్ష స్వభావాన్ని మారుస్తారు. కానీ శిక్షకాలం తగ్గించడం జరగదు. ఉదాహరణకు ఆరేళ్ల కఠిన కారాగార శిక్షను ఆరు సంవత్సరాల సాధారణ శిక్షగా మార్చడం.

3) రిమిషన్‌: దీనిలో శిక్ష స్వభావం మార్చకుండా, శిక్షకాలం మాత్రమే మారుస్తారు. ఉదాహరణకు ఆరు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్షగా మార్చడం

4) రెస్పైట్‌: ఏదైనా ఒక ప్రత్యేక కారణాన్ని దృషిలో ఉంచుకొని క్షమాభిక్ష పెట్టడాన్ని రెస్పైట్‌ అంటారు.

5) రిప్రయివ్‌: శిక్ష అమలును వాయిదా వేయడం.

  • క్షమాభిక్ష పిటిషన్‌ను ఎన్నిసార్లయినా అప్పీల్‌ చేసుకోవచ్చు. కానీ మొదటి అప్పీల్‌కు మాత్రమే రిప్రయివ్‌కు అవకాశం ఉంటుంది.

  • పైన పేర్కొన్న క్షమాభిక్షాధికారాలను రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు నిర్వహిస్తారు.

క్షమాభిక్ష అధికారంపై న్యాయసమీక్ష

  • రాజ్యాంగం ప్రకారం క్షమాభిక్షపై న్యాయసమీక్షకు అవకాశం లేదు. కానీ సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పు ప్రకారం క్షమాభిక్షపై న్యాయసమీక్ష జరపవచ్చు. ఉదాహరణకు 1985లో కేమార్‌సింగ్‌ కేసు, 2004లో ధనుంజయ ఛటర్జీ కేసు, 2006లో గౌరు వెంకటరెడ్డి కేసులో...

సైనిక అధికారాలు

ఆర్టికల్‌-53: రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడు. ఈ హోదాలో కింది అధికారాలు కలిగి ఉంటాడు.

1) త్రివిధ దళాధిపతులను నియమిస్తాడు. 2) యుద్ధ ప్రకటన, విరమణ ప్రకటన చేస్తారు.

  • పై అధికారాలు ఉపయోగించుకోవాలంటే పార్లమెంటు ఆమోదం అవసరం.

రాయబార అధికారాలు

  • రాష్ట్రపతి దేశం తరపున ప్రథమ రాయబారి. ఈ హోదాలో విదేశాల్లో రాయబారులను, దౌత్యవేత్తలను నియమిస్తారు. ఇతర దేశాల రాయబారులను ఆహ్వానిస్తారు. అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకుంటాడు, ఐక్యరాజ్యసమితికి ప్రతినిధులను పంపిస్తారు. ఈ అధికారాలను నిర్వహించడానికి కూడా పార్లమెంటు ఆమోదం అవసరం.

గమనిక: 1) రాయబారులు(హై కమిషనర్‌): కామన్‌వెల్త్‌ దేశాల్లో భారతదేశం తరపున నియమించిన భారత ప్రతినిధి. 2) దౌత్యవేత్తలు: కామన్‌వెల్త్‌ దేశాల్లో కాకుండా ఇతర దేశాల్లో పనిచేసే భారత ప్రతినిధులు.

V-Chaitanya-Dev.gif

-వి.చైతన్యదేవ్‌

పోటీ పరీక్షల నిపుణులు

Updated Date - 2022-11-21T17:23:08+05:30 IST