ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు స్పెషల్‌ కోచింగ్‌

ABN , First Publish Date - 2022-06-07T23:03:12+05:30 IST

భారత ప్రభుత్వ పరిధిలోని నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌ ఫర్‌ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోచింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఉన్న ఎన్‌ఎస్‌టీఐ క్యాంపస్‌ కింది కోర్సులను నిర్వహిస్తోంది...

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు స్పెషల్‌ కోచింగ్‌

భారత ప్రభుత్వ పరిధిలోని నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌ ఫర్‌ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోచింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఉన్న ఎన్‌ఎస్‌టీఐ క్యాంపస్‌ కింది కోర్సులను నిర్వహిస్తోంది. 


  • స్పెషల్‌ కోచింగ్‌ స్కీమ్‌ ఫర్‌ ఎస్సీ/ ఎస్టీ ఫర్‌ 2022-23: ఇంగ్లీష్‌ ఒక సబ్జెక్టుగా ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు అర్హులు. ఈ ఏడాది జూలై 1 నాటికి వయస్సు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. శిక్షణ కాలం 11 నెలలు. ఈ సమయంలో నెలకు రూ.వెయ్యి స్టయిపెండ్‌ చెల్లిస్తారు. 
  • ఓ లెవల్‌ కంప్యూటర్‌ ట్రైనింగ్‌(నీలిట్‌ లేదా దాని అక్రెడిటెడ్‌ సంస్థల సహకారంతో): ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష  లేదా అంతకుమించి అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులు. డిగ్రీ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండరాదు. ఈ ఏడాది జూలై 1 నాటికి వయస్సు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. శిక్షణ కాలం ఒక ఏడాది. ఈ సమయంలో నెలకు రూ.వెయ్యి స్టయిపెండ్‌ 11 నెలల పాటు చెల్లిస్తారు.
  • ఓ లెవల్‌ హార్డ్‌వేర్‌ మెయింటెనెన్స్‌(నీలిట్‌ లేదా దాని అక్రెడిటెడ్‌ సంస్థల సహకారంతో):  ఇంటర్‌/ ఐటిఐ(టెన్త్‌ తరవాత)/ డిప్లొమా/ పీజీ/ డాక్టరేట్‌ ఉత్తీర్ణులు అర్హులు. ఈ ఏడాది జూలై 1 నాటికి వయస్సు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. శిక్షణ కాలం ఒక ఏడాది. ఈ సమయంలో నెలకు రూ.వెయ్యి స్టయిపెండ్‌ చెల్లిస్తారు.
  • కుటుంబ ఆదాయం రూ.3 లక్షలకు మించరాదు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్యాంపస్‌ నుంచి దరఖాస్తును పొందవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తుకు సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలను జతచేసి అక్కడే ఇవ్వాల్సి ఉంటుంది. పదో తరగతి నుంచి అకడమిక్‌ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఆధార్‌, ఎంప్లాయ్‌మెంట్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ పాస్‌బుక్‌ మొదటి పేజీ, రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలు అవసరమవుతాయి. 

దరఖాస్తుకు ఆఖరుతేదీ: జూన్‌ 24.

క్యాంపస్‌ చిరునామా: నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌ ఫర్‌ ఎస్సీ/ఎస్టీ, ఎన్‌ఎస్‌టీఐ క్యాంపస్‌, విద్యానగర్‌, హైదరాబాద్‌- 500007. ఫోన్‌ నంబరు 040-27408555

Read more