IIT(బాంబే)-మోనాష్ ఉమ్మడి పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2022-02-23T20:09:24+05:30 IST

బాంబేలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీబీ), ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీ ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఐఐటీబీ మోనాష్‌ రిసెర్చ్‌ అకాడమీ - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు....

IIT(బాంబే)-మోనాష్ ఉమ్మడి పీహెచ్‌డీ

బాంబేలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీబీ), ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీ ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఐఐటీబీ మోనాష్‌ రిసెర్చ్‌ అకాడమీ - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. ప్రోగ్రామ్‌ వ్యవధి మూడున్నరేళ్లు. అభ్యర్థులు ఎంచుకొన్న రిసెర్చ్‌ అంశాన్ని అనుసరించి కనిష్ఠంగా మూడునెలలు, గరిష్ఠంగా ఆర్నెల్లు/ ఏడాది వరకు మోనాష్‌ యూనివర్సిటీలో చదవాల్సి ఉంటుంది.


రిసెర్చ్‌ థీమ్స్‌

  • అడ్వాన్స్‌డ్‌ కంప్యూటేషనల్‌ ఇంజనీరింగ్‌, సిమ్యులేషన్‌ అండ్‌ మాన్యుఫాక్చర్‌ 
  • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీరింగ్‌
  • క్లీన్‌ ఎనర్జీ
  • వాటర్‌
  • నానోటెక్నాలజీ
  • బయోటెక్నాలజీ అండ్‌ స్టెమ్‌ సెల్‌ రిసెర్చ్‌
  • హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌
  • డిజైన్‌


రిసెర్చ్‌  క్లస్టర్స్‌

  • మెటీరియల్‌ సైన్స్‌/ ఇంజనీరింగ్‌(నానో, మెటలర్జీ సహా)
  • ఎనర్జీ, గ్రీన్‌ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ, కెటాలిసిస్‌, రియాక్షన్‌ ఇంజనీరింగ్‌
  • మేథ్స్‌, సీఎ్‌ఫడీ, మోడలింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌
  • సీఎస్‌ఈ, ఐటీ, ఆప్టిమైజేషన్‌, డేటా, సెన్సార్స్‌, సిస్టమ్స్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, కంట్రోల్‌
  • ఎర్త్‌ సైన్సెస్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌(జియో, వాటర్‌, క్లయిమేట్‌)
  • బయో, స్టెమ్‌ సెల్స్‌, బయో కెమిస్ట్రీ, ఫార్మా, ఫుడ్‌
  • సెమి కండక్టర్స్‌, ఆప్టిక్స్‌, ఫొటోనిక్స్‌, నెట్‌వర్క్స్‌, టెలీకాం, పవర్‌ ఇంజనీరింగ్‌
  • డిజైన్‌, హెచ్‌ఎ్‌సఎస్‌, మేనేజ్‌మెంట్‌


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీనుంచి సంబంధిత విభాగంలో నాలుగేళ్ల డిగ్రీతోపాటు మాస్టర్స్‌ పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ, పీజీ స్థాయుల్లో ప్రథమ శ్రేణి మార్కులు ఉండాలి. గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ తప్పనిసరి. ఈ స్కోర్‌ లేని పక్షంలో కనీసం రెండేళ్ల ప్రొఫెషనల్‌ అనుభవం ఉన్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. మోనాష్‌ యూనివర్సిటీ నిర్దేశించిన మేరకు ఆంగ్ల భాష ప్రావీణ్యానికి సంబంధించిన అర్హతలు ఉండాలి. 


ఎంపిక: వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అకడమిక్‌ ప్రతిభ, గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌/ అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ-మెయిల్‌ ద్వారా సమాచారమిస్తారు.

స్కాలర్‌షిప్‌: మొదటి రెండేళ్లు ఏడాదికి రూ.4,20,000; తరవాత ఏడాదికి రూ.4,68,000 స్కాలర్‌షిప్‌ ఇస్తారు. ఆస్ట్రేలియాలో చదివేటప్పుడు ఏడాదికి 29,000 ఆస్ట్రేలియన్‌ డాలర్ల గ్రాంట్‌ ఇస్తారు.


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28

వెబ్‌సైట్‌: http://iitbmonash.org



Updated Date - 2022-02-23T20:09:24+05:30 IST