UPS IFS ఎగ్జామ్‌ 2022

ABN , First Publish Date - 2022-02-04T20:50:35+05:30 IST

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ...

UPS IFS ఎగ్జామ్‌ 2022

మొత్తం పోస్టుల సంఖ్య 151

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: 2022 ఆగస్టు 01 నాటికి 21 ఏళ్లు తగ్గకుండా, 32 ఏళ్లు మించకుండా ఉండాలి. అంటే..1990 ఆగస్టు 01 నుంచి 2001 ఆగస్టు 01 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష(ప్రిలిమినరీ, మెయిన్స్‌), ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష: దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కోదానికి 200 మార్కులు కేటాయిస్తారు. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌టైప్‌ మల్టిపుల్‌ చాయిస్‌ రూపంలో ఉంటాయి. దీన్ని అర్హత పరీక్షగా మాత్రమే నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని మెయిన్స్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. 

ప్రిలిమ్స్‌ తేదీ: 2022 జూన్‌ 05        

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. మహిళా/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.    

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 22

వెబ్‌సైట్‌: www.upsc.gov.in



Updated Date - 2022-02-04T20:50:35+05:30 IST