Competitive exams: నందిత పుట్టిన తేదీ ఎప్పుడు?

ABN , First Publish Date - 2022-11-23T15:49:00+05:30 IST

విజయ్‌కు అతని సోదరుని పుట్టినరోజు అక్టోబరు 20 నుంచి 25 మధ్య అని గుర్తు. అతని తండ్రికి తన కుమారుని పుట్టినరోజు అక్టోబరు 23 నుంచి 28 మధ్య అని గుర్తు

Competitive exams: నందిత పుట్టిన తేదీ ఎప్పుడు?
నందిత పుట్టిన తేదీ ఎప్పుడు?

టైమ్ సీక్వెన్స్ టెస్ట్

1. విజయ్‌కు అతని సోదరుని పుట్టినరోజు అక్టోబరు 20 నుంచి 25 మధ్య అని గుర్తు. అతని తండ్రికి తన కుమారుని పుట్టినరోజు అక్టోబరు 23 నుంచి 28 మధ్య అని గుర్తు. అయితే విజయ్‌ సోదరుని పుట్టినరోజు ఏ తేదీ అవుతుంది?

ఎ) అక్టోబరు 22 బి) అక్టోబరు 24

సి) అక్టోబరు 25 డి) ఏదీకాదు

సమాధానం: (బి)

విజయ్‌కు అతని సోదరుని పుట్టినరోజు అక్టోబరు 20 నుంచి 25 మధ్య అని గుర్తు. అంటే ఇచ్చిన తేదీలకు మధ్య తేదీలు తీసుకోవాలి. 21, 22, 23, 24

అతని తండ్రికి తన కుమారుని పుట్టినరోజు అక్టోబరు 23 నుంచి 28 మధ్య అని గుర్తు. అంటే ఇచ్చిన తేదీలకు మధ్య తేదీలు తీసుకోవాలి. 24, 25, 26, 27.

గమనించండి: రెండింటిలో కామన్‌గా ఉండే తేదీ ‘24’ సమాధానం అవుతుంది.

2. ఒక రైలు విజయవాడకు ప్రతి గంటకు ఉంది. విచారణాధికారి(ఎంక్వైయిరీ క్లర్క్‌) తనను కలిసిన ప్రయాణికుడితో రైలు వెళ్ళిపోయి 15 నిశ్రీశ్రీ అయింది, తరవాత రైలు 11.00a.m. అని చెప్పాడు. అయితే ఈ సమాచారాన్ని విచారణాధికారి ప్రయాణికుడితో ఏ సమయంలో చెప్పారు.

ఎ) 10.20a.m. . బి) 10.15a.m. సి) 10.30a.m. డి) ఏదీకాదు సమాధానం: (బి)

వివరణ: ప్రశ్నలో రైలు ప్రతి గంటకు ఉంది తరవాత రైలు 11.00 ్చ.ఝ. అని ఇచ్చారు. అంటే దాని ముందు రైలు సమయం 10.00 a.m. విచారణాధికారి (ఎంక్వైయిరీ క్లర్క్‌) రైలు వెళ్ళిపోయి 15 నిశ్రీశ్రీ అయింది అని చెప్పాడు. అంటే దీని అర్థం ప్రయాణికుడు 15 నిశ్రీశ్రీ ఆలస్యంగా వచ్చాడు. (ఆలస్యంగా వస్తేనే రైలు వెళ్ళిపోయింది) కాబట్టి విచారణాధికారికి, ప్రయాణికుడికి మధ్య సంభాషణ జరిగిన సమయం 10.00 + 15 °}} = Væü…}} 10.15 సమాధానం అవుతుంది.

3. తేజకు అతని సోదరి నందిత పుట్టినరోజు జూలై 21 నుంచి జూలై 26 మధ్య అని గుర్తు. మరో సోదరుడు భవే్‌షకు వారి సోదరి పుట్టినరోజు జూలై 24 నుంచి 29 మధ్య అని గుర్తు. అయితే నందిత పుట్టినరోజు ఏ తేదీ అవుతుంది?

ఎ) జూలై 26 బి) జూలై 25 సి) జూలై 24

డి) ఏదీకాదు సమాధానం: (బి)

వివరణ: తేజకు అతని సోదరి పుట్టినరోజు జూలై 21 నుంచి 26 మధ్య అని గుర్తు. అంటే ఇచ్చిన తేదీలకు మధ్యలోని తేదీలు తీసుకోవాలి. 22, 23, 24, 25 భవే్‌షకు, సోదరి నందిత పుట్టినరోజు జూలై 24 నుంచి 29 మధ్య అని గుర్తు. ఇచ్చిన తేదీలకు మధ్యలోని తేదీలు 25, 26, 27, 28.

గమనించండి: రెండింటిలో కామన్‌గా ఉండే తేదీ ‘25’. కాబట్టి జూలై 25 సమాధానం అవుతుంది.

4. పవన్‌కు అతని సోదరుడు శ్యామ్‌ పుట్టినరోజు ఆగస్టు 3 నుంచి ఆగస్టు 8 మధ్య అని గుర్తు. అతని తండ్రి శ్రీనివా్‌సకు తన కుమారుని పుట్టినరోజు ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 మధ్య అని గుర్తు. అయితే శ్యామ్‌ పుట్టినరోజు

ఎ) ఆగస్టు 7 బి) ఆగస్టు 8 సి) ఆగస్టు 6 డి)ఏదీకాదు సమాధానం: (ఎ)

వివరణ: పవన్‌కు అతని సోదరుడు శ్యామ్‌ పుట్టినరోజు ఆగస్టు 3 నుంచి ఆగస్టు 8 మధ్య అని గుర్తు, ఇచ్చిన తేదీలకు మధ్యలోని తేదీలు 4, 5, 6, 7. అతని తండ్రి శ్రీనివా్‌సకు తన కుమారుని పుట్టినరోజు ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 మధ్య అని గుర్తు. ఇచ్చిన తేదీలకు మధ్య తేదీలు 7, 8, 9. రెండింటిలో కామన్‌గా ఉండే తేదీ 7. కాబట్టి ఆగస్టు 7 సమాధానం అవుతుంది.

5. సాత్విక్‌కు అతని తల్లిదండ్రుల పెళ్లిరోజు అక్టోబరు 7 నుంచి అక్టోబరు 12 మధ్య అని గుర్తు. అతని సోదరి సౌమికకు వారి తల్లితండ్రుల పెళ్లిరోజు అక్టోబరు 9 నుంచి అక్టోబరు 4 మధ్య అని గుర్తు. అయితే సాత్విక్‌, సౌమిక తల్లిదండ్రుల పెళ్లిరోజు ఏ తేదీ అవుతుంది?

ఎ) అక్టోబరు 10 బి)అక్టోబరు 11

సి) అక్టోబరు 10 లేదా 11 డి) ఏదీకాదు

సమాధానం: (సి)

వివరణ: సాత్విక్‌కు అతని తల్లిదండ్రుల పెళ్లిరోజు అక్టోబరు 7 నుంచి 12 మధ్య అని గుర్తు. ఇచ్చిన తేదీలకు మధ్య తేదీలు 8, 9, 10, 11. అతని సోదరి సౌమికకు వారి తల్లిదండ్రుల పెళ్లిరోజు అక్టోబరు 9 నుంచిఅక్టోబరు 14కు మధ్య అని గుర్తు, ఇచ్చిన తేదీలకు మధ్య తేదీలు 10, 11, 12, 13.

గమనించండి: రెండింటిలో కామన్‌గా ఉన్న తేదీలు 10 మరియు 11. ఈవిధంగా రెండు తేదీలు వచ్చినప్పుడు అక్టోబరు 10 లేదా అక్టోబరు 11 (అంటే either, or)) సమాధానంగా గుర్తించాలి.

6. పవిత్రకు ఆమె సోదరి మేఘన పుట్టినరోజు జనవరి 20 నుంచి జనవరి 24 మధ్య అని గుర్తు. వారి మరో సోదరి మౌనికకు, మేఘన పుట్టినరోజు ఫిబ్రవరి 22 మరియు ఫిబ్రవరి 26ల మధ్య అని గుర్తు. అయితే పవిత్ర మౌనికల ప్రకారం వారి సోదరి మేఘన పుట్టినరోజు ఏ తేదీ అవుతుంది?

ఎ) జనవరి 23 బి) ఫిబ్రవరి 23

సి) చెప్పలేం డి) ఏదీకాదు

సమాధానం: (సి)

వివరణ: పవిత్రకు ఆమె సోదరి మేఘన పుట్టినరోజు జనవరి 20 నుంచి జనవరి 24 మధ్య అని గుర్తు. వారి మరో సోదరి మౌనికకు, మేఘన పుట్టినరోజు ఫిబ్రవరి 22 మరియు ఫిబ్రవరి 24ల మధ్య అని గుర్తు.

గమనించండి: ఇద్దరి సమాచారం ప్రకారం నెలలు వేర్వేరుగా ఉన్నాయి. దాదాపు 30 రోజుల తేడా ఉన్నది. కాబట్టి సమాధానం చెప్పలేం అవుతుంది.

7. ముంబయికి రైలు ప్రతి 75 ని..లకు ఉంది. విచారణాధికారి తనను కలిసిన ప్రయాణికుడితో రైలు వెళ్ళిపోయి 20 నిశ్రీశ్రీ అయింది. తరవాత రైలు 10.00a.m. అని చెప్పాడు. అయితే ఈ సమాచారాన్ని విచారణాధికారి ప్రయాణికుడితో ఏ సమయంలో చెప్పాడు?

ఎ) 9.05a.m. బి) 9.00a.m. సి) 9.15a.m.

డి) 9.10a.m. సమాధానం: (ఎ)

వివరణ: రైలు ముంబయికి ప్రతి 75 ని అంటే 1 గంట 15 నిశ్రీశ్రీలకు ఉంది. తదుపరి రైలు వచ్చే సమయం 10.00a.m. అని ఇచ్చారు. అంటే దాని ముందు రైలు వచ్చిన సమయం 10.00- 1 గంట 15 ని.. = గం 8.45 ని.. విచారణాధికారి ప్రయాణికుడితో రైలు వెళ్ళిపోయి 20 ని.. అయింది అని చెప్పాడు. దాని అర్థం ప్రయాణికుడు 20 ని.. ఆలస్యంగా వచ్చాడు. (ఆలస్యంగా వస్తేనే కదండి రైలు వెళ్ళిపోయింది). కాబట్టి విచారణాధికారి, ప్రయాణికుడికి మధ్య సంభాషణ జరిగిన సమయం 8.45 + 20 = గం.. 9.05 ని.. సమాధానం అవుతుంది.

8. ఒక బస్సు వరంగల్‌కు ప్రతి 45 ని..లకు ఉంది. విచారణాధికారి తనను కలిసిన ప్రయాణికుడితో బస్సు వెళ్ళిపోయి 15 ని.. అయింది. తరవాత బస్సు 11.30a.m. అని చెప్పాడు. అయితే ఈ సమాచారాన్ని విచారణాధికారి ప్రయాణికుడితో ఏ సమయంలో చెప్పాడు?

ఎ) 10.50a.m. బి) 11.00a.m. సి) 11.10a.m. డి) 11.15a.m. సమాధానం: (బి)

వివరణ: బస్సు వరంగల్‌కు ప్రతి 45 ని.. ఉంది. తదుపరి బస్సు వచ్చే సమయం గం.. 11.30ని.. అంటే ముందు బస్సు వచ్చిన సమయం 11.30-45 ని.. = గం.. 10.45 ని.. విచారణాధికారి ప్రయాణికుడితో బస్సు వెళ్ళిపోయి 15 ని.. అయింది అని చెప్పాడు. దాని అర్థం ప్రయాణికుడు 15 ని.. ఆలస్యంగా వచ్చాడు. కాబట్టి విచారణాధికారికి, ప్రయాణికుడికి మధ్య సంభాషణ జరిగిన సమయం 10.45+15 ని.. = 11.00a.m. .అవుతుంది.

meenakshi-reasoning(new).gif

-పండిటి మీనాక్షి పవన్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ

Updated Date - 2022-11-23T15:49:02+05:30 IST