Notification: ‘పెట్రోలియం అండ్‌ ఎనర్జీ’లో పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2022-11-23T16:32:29+05:30 IST

విశాఖపట్నం (Visakhapatnam)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ(Indian Institute of Petroleum and Energy) (ఐఐపీఈ) - పీహెచ్‌డీ స్ర్పింగ్‌ సెమిస్టర్‌ ప్రోగ్రామ్‌లో

Notification: ‘పెట్రోలియం అండ్‌ ఎనర్జీ’లో పీహెచ్‌డీ
పీహెచ్‌డీ

విశాఖపట్నం (Visakhapatnam)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ(Indian Institute of Petroleum and Energy) (ఐఐపీఈ) - పీహెచ్‌డీ స్ర్పింగ్‌ సెమిస్టర్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెగ్యులర్‌, స్పాన్సర్డ్‌, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌, ఇండివిడ్యువల్‌ ఫెలోషిప్‌ కేటగిరీల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు. ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. గరిష్ఠంగా ఎనిమిదేళ్లలో పూర్తి చేయవచ్చు. ప్రోగ్రామ్‌లో భాగంగా కోర్సు వర్క్‌, పబ్లికేషన్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ వర్క్‌, సెమినార్‌లు, కాంప్రహెన్సివ్‌ ఎగ్జామినేషన్‌, వైవా, అవార్డ్‌ ఆఫ్‌ పేటెంట్స్‌ ఉంటాయి. అకడమిక్‌ మెరిట్‌, ఎంట్రెన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

విభాగాలు: బయోసైన్స్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎర్త్‌ సైన్సెస్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, మేథమెటిక్స్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, పెట్రోలియం ఇంజనీరింగ్‌

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌తో ఎంఈ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ/ డ్యూయెల్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ, పీజీ స్థాయుల్లో ప్రథమ శ్రేణి మార్కులు ఉండాలి. ఎన్‌బీహెచ్‌ఎం/ నెట్‌/ గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ తప్పనిసరి. లేని పక్షంలో ఏఐసీటీఈ/ యూజీసీ గుర్తింపు పొందిన డిగ్రీ కళాశాలల్లో కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలి. స్పాన్సర్డ్‌ అభ్యర్థులకు పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌, కోల్‌, ఎర్త్‌ సైన్సెస్‌, కెమికల్‌ అండ్‌ ఫర్టిలైజర్‌, డిఫెన్స్‌ సంస్థలు; పీఎ్‌సయూలు, ఆర్‌ అండ్‌ డీ సంస్థలు, నేషనల్‌ ల్యాబొరేటరీలు, సంస్థ గుర్తింపు పొందిన ఇండస్ట్రీలలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వీరు స్పాన్సర్‌షిప్‌ సర్టిఫికెట్‌ సబ్మిట్‌ చేయాలి. ఇండివిడ్యువల్‌ ఫెలోషిప్‌ కేటగిరీ కింద ప్రవేశం పొందాలంటే సీఎ్‌సఐఆర్‌/ యూజీసీ/ డీబీటీ/ఐసీఏఆర్‌/ఇన్‌స్పయిర్‌ నుంచి వ్యాలిడ్‌ జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషి్‌ప(జేఆర్‌ఎఫ్‌) అర్హత ఉండాలి. ఐఐటీలు, ఐఐఎస్సీ, ఐఐపీఈ, ఆర్‌జీఐపీటీ సంస్థలనుంచి కనీసం 8 సీజీపీఏతో బీటెక్‌/ డ్యూయెల్‌ డిగ్రీ - బీటెక్‌ అండ్‌ ఎంటెక్‌ / అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ జామ్‌ స్కోర్‌తో రెండేళ్ల ఎమ్మెస్సీ పూర్తిచేసినవారికి నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు.

రిసెర్చ్‌ అసిస్టెంట్‌షిప్‌: అభ్యర్థులకు సంస్థ గరిష్ఠంగా అయిదేళ్లపాటు రిసెర్చ్‌ అసిస్టెంట్‌షిప్‌ అందిస్తుంది. మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000; తరవాత మూడేళ్లు నెలకు రూ.35,000 చెల్లిస్తారు. కంటింజెన్సీ గ్రాంట్‌ కింద ఏడాదికి రూ.30,000 ఇస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 25

ఎంట్రెన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు: డిసెంబరు 8 నుంచి 10 వరకు

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: డిసెంబరు 15

అడ్మిషన్‌ తేదీ: డిసెంబరు 26

వెబ్‌సైట్‌: www.iipe.ac.in

Updated Date - 2022-11-23T16:32:30+05:30 IST