IIMU: ఉదయ్‌పూర్‌ ఐఐఎంలో పీజీడీబీఏ

ABN , First Publish Date - 2022-12-03T15:25:17+05:30 IST

ఉదయ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (Indian Institute of Management) (ఐఐఎంయూ) - పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు

IIMU: ఉదయ్‌పూర్‌ ఐఐఎంలో పీజీడీబీఏ
ఐఐఎంలో పీజీడీబీఏ

ఉదయ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (Indian Institute of Management) (ఐఐఎంయూ) - పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రోగ్రామ్‌ని వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ఉద్దేశించారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 మార్చి 31 నాటికి కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. జీమ్యాట్‌/ జీఆర్‌ఈ/ క్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ తప్పనిసరి. లేదంటే సంస్థ నిర్వహించే అడ్మిషన్‌ టెస్ట్‌ రాయాల్సి ఉంటుంది. ఇందులో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్‌ ఇస్తారు.

ప్రోగ్రామ్‌ వివరాలు: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. దీనిని బ్లెండెడ్‌ విధానంలో నిర్వహిస్తారు. శనివారం, ఆదివారం రోజుల్లో ఆన్‌లైన్‌ సెషన్స్‌ ఉంటాయి. ప్రతి వారాంతానికి ఆరు సెషన్స్‌ నిర్దేశించారు. ఒక్కో సెషన్‌ వ్యవధి 90 నిమిషాలు. ప్రోగ్రామ్‌లో నిర్దేశించిన మేరకు క్యాంపస్‌ మాడ్యూల్స్‌ నిర్వహిస్తారు.

ఈ ప్రోగ్రామ్‌లో ఏడాదికి రెండు చొప్పున మొత్తం నాలుగు టర్మ్‌లు ఉంటాయి. మొదటి టర్మ్‌లో ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌ అనాలసిస్‌, ఇండివిడ్యువల్‌ అండ్‌ గ్రూప్‌ డైనమిక్స్‌, మేనేజీరియల్‌ ఓరల్‌ కమ్యూనికేషన్‌, రిటెన్‌ మేనేజీరియల్‌ కమ్యూనికేషన్‌, మైక్రో ఎకనామిక్స్‌ ఫర్‌ మేనేజర్స్‌, స్ర్పెడ్‌ షీట్‌ మోడలింగ్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ డేటా మైనింగ్‌-1 కోర్సులు ఉంటాయి. రెండో టర్మ్‌లో డిజిటల్‌ టెక్నాలజీస్‌ ఫర్‌ మేనేజర్స్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ రిసెర్చ్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ డేటా మైనింగ్‌-2, కార్పొరేట్‌ ఫైనాన్స్‌-1, కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌, మేక్రో ఎకనామిక్స్‌ ఫర్‌ మేనేజర్స్‌ కోర్సులు ఉంటాయి. మూడో టర్మ్‌లో స్ట్రాటజిక్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్గనైజేషనల్‌ డైనమిక్స్‌, డిజైన్‌ థింకింగ్‌, లీగల్‌ యాస్పెక్ట్స్‌ ఆఫ్‌ బిజినెస్‌, స్ర్పెడ్‌ షీట్‌, కార్పొరేట్‌ ఫైనాన్స్‌-2, బిజినెస్‌ ఎథిక్స్‌, ఒక ఎలక్టివ్‌ కోర్సు ఉంటాయి. నాలుగో టర్మ్‌లో హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌, అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, లీడర్‌షిప్‌, రెండు ఎలక్టివ్‌ కోర్సులు, క్యాప్‌స్టోన్‌ ప్రాజెక్ట్‌ ఉంటాయి.

ఎలక్టివ్‌ కోర్సులు: సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ ఫోర్‌క్యాస్టింగ్‌, నెగోషియేషన్స్‌, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, బీ2బీ మార్కెటింగ్‌ కోర్సుల్లో ఏవైనా మూడింటిని ఎంచుకోవాలి.

ఐఐఎంయూ అడ్మిషన్‌ టెస్ట్‌ వివరాలు: దీనిని ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 120 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంట్రప్రిటేషన్‌ అంశాలకు సంబంధించి ఒక్కోదానిలో 40 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 120. పరీక్ష సమయం రెండు గంటలు.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.1,000

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 21

ఐఐఎంయూ అడ్మిషన్‌ టెస్ట్‌ తేదీ: 2023 జనవరి 8

ఫలితాలు విడుదల: 2023 జనవరి 18న

ప్రోగ్రామ్‌ ప్రారంభం: 2023 మే 27 నుంచి

వెబ్‌సైట్‌: iimu.ac.in

Updated Date - 2022-12-03T15:25:18+05:30 IST