Foreign tradeలో పీజీ డిప్లొమా

ABN , First Publish Date - 2022-10-07T20:42:30+05:30 IST

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) - ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ గ్లోబల్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌(ఈపీజీడీ - జీహెచ్‌ఆర్‌ఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి

Foreign tradeలో పీజీ డిప్లొమా

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) - ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ గ్లోబల్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌(ఈపీజీడీ - జీహెచ్‌ఆర్‌ఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది వారాంత ప్రోగ్రామ్‌. దీనిని వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ప్రత్యేకించారు. ఢిల్లీ క్యాంప్‌సలో అందుబాటులో ఉంది. ప్రోగ్రామ్‌ వ్యవధి 18 నెలలు. నాలుగు టర్మ్‌లు ఉంటాయి. ప్రతినెలా వారాంతాల్లో తరగతులు ఉంటాయి. క్యాప్‌స్టోన్‌ ప్రాజెక్ట్‌, మెంటార్‌షిప్‌ ప్రోగ్రామ్‌లు, ఇంటర్నేషనల్‌ స్టడీ టూర్‌ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌ను ఫిజికల్‌ మోడ్‌లో నిర్వహిస్తారు. మొత్తం 120 సీట్లు ఉన్నాయి. అభ్యర్థులను అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, పర్సనల్‌ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.  

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌ లెవల్లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. లా/ ఇంజనీరింగ్‌/ ఆర్కిటెక్చర్‌/ మెడిసిన్‌/ ఫార్మసీ/ అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌ విభాగాల్లో పీజీ ఉత్తీర్ణతతోపాటు కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. వయోపరిమితి నిబంధనలు లేవు. 


ముఖ్య సమాచారం

ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.2,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000

చివరి తేదీ: అక్టోబరు 10    

వెబ్‌సైట్‌: www.iift.ac.in

Updated Date - 2022-10-07T20:42:30+05:30 IST