ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ అనుబంధ కాలేజీల్లో పీజీ ప్రవేశాలు

ABN , First Publish Date - 2022-01-10T18:38:56+05:30 IST

విజయవాడలోని డా.ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌) - మెడికల్‌ విభాగాల్లో పీజీ, పీజీ డిప్లొమా ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది

ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ అనుబంధ కాలేజీల్లో పీజీ ప్రవేశాలు

విజయవాడలోని డా.ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌) - మెడికల్‌ విభాగాల్లో పీజీ, పీజీ డిప్లొమా ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనుబంధ ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ నాన్‌ మైనారిటీ అండ్‌ మైనారిటీ మెడికల్‌ కాలేజ్‌లలో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. నీట్‌ పీజీ 2021 స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.


స్పెషలైజేషన్‌లు: జనరల్‌ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, అనెస్థీషియా, డెర్మటాలజీ - వెనెరాలజీ - లెప్రసీ, సైకాలజీ, రేడియేషన్‌ అంకాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌, ఫ్యామిలీ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌, ఆప్తల్మాలజీ, ఈఎన్‌టీ, గైనకాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, అనాటమీ, ఫిజియోథెరపీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, క్లినికల్‌ పాథాలజీ, పబ్లిక్‌ హెల్త్‌ తదితరాలు.

అర్హత: గుర్తింపు పొందిన మెడికల్‌ కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. జనరల్‌ అభ్యర్థులకు 50 శాతం; ఓసీ దివ్యాంగులకు 45 శాతం; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు తప్పనిసరి. గత ఏడాది సెప్టెంబరు 30 నాటికి ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా/ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొంది ఉండాలి. నీట్‌ పీజీ 2021లో జనరల్‌ అభ్యర్థులకు 302; ఓసీ దివ్యాంగులకు 283; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 265 కటాఫ్‌ స్కోర్‌ను నిర్దేశించారు.   

రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు: తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు రూ.7,080; ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూ.10,620; విదేశీ అభ్యర్థులకు రూ.15,340
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 15
వెబ్‌సైట్‌: http://ntruhs.ap.nic.in

Updated Date - 2022-01-10T18:38:56+05:30 IST