ఆయా కోర్సుల్లో ప్రవేశానికి ఎన్‌టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్
ABN , First Publish Date - 2022-02-02T17:29:35+05:30 IST
విజయవాడలోని డా.ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్)-ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనుబంధ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి...
విజయవాడలోని డా.ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్)-ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనుబంధ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్ మైనారిటీ, మైనారిటీ కాలేజ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ యూజీ 2021 స్కోర్, కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌లు వర్తిస్తాయి.
నీట్ కటాఫ్ స్కోర్: మొత్తం 720 మార్కులకుగాను జనరల్, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు 138; జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ దివ్యాంగులకు 122; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 108 మార్కులను కటాఫ్ స్కోర్‌గా నిర్దేశించారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు: ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 85 శాతం సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో 50 శాతం ‘ఏ’ కేటగిరీ సీట్లు ఉన్నాయి. తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్‌లో ఉన్న 126 ఎంబీబీఎస్ సీట్లను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేస్తారు.
ప్రభుత్వ కాలేజ్‌లు - సీట్లు:
సిద్దార్థ మెడికల్ కాలేజ్, విజయవాడ - 149
ఆంధ్ర మెడికల్ కాలేజ్, విశాఖపట్నం - 212
రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ - 212
గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు - 213
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, శ్రీకాకుళం - 128
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఒంగోలు - 102
ఎస్వీ మెడికల్ కాలేజ్, తిరుపతి - 204
కర్నూలు మెడికల్ కాలేజ్, కర్నూలు - 213
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అనంతపురం - 128
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కడప - 149
ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నెల్లూరు - 149
గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, విజయవాడ - 34
గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, కడప - 85
ఆయుష్ కోర్సులు
బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ ఆయుర్వేద/ హోమియో/ యునానీ కళాశాలల్లో అడ్మిషన్‌లు నిర్వహిస్తారు.
బీఏఎంఎస్ ప్రభుత్వ కాలేజ్‌లు - సీట్లు:
డా.ఎన్‌ఆర్‌ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్, విజయవాడ - 74
ఎస్వీ ఆయుర్వేదిక్ కాలేజ్, తిరుపతి - 39
బీహెచ్‌ఎంఎస్ ప్రభుత్వ కాలేజ్‌లు - సీట్లు:
డా.గురురాజు గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్, గుడివాడ - 49
డా.అల్లు రామలింగయ్య గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్, రాజమండ్రి - 62
గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్, కడప - 37
బీయూఎంఎస్ ఎయిడెడ్ కాలేజ్ - సీట్లు
డా.అబ్దుల్ హక్ యునానీ మెడికల్ కాలేజ్, కర్నూలు - 49
అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఫిజిక్స్, కెమి స్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ), ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సైన్స్ సబ్జెక్ట్‌లలో జనరల్ అభ్యర్థులకు కనీసం 50 శాతం; జనరల్ కేటగిరి దివ్యాంగులకు 45 శాతం; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండాలి. అభ్యర్థుల వయసు డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు విధానం
ముందుగా అభ్యర్థులు మొబైల్ నెంబర్, ఈ - మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తరవాత నీట్ యూజీ 2021 రోల్ నెంబర్, ర్యాంక్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలి. సంబంధిత సర్టిఫికెట్‌లను అప్‌లోడ్ చేసుకోవాలి.
మొబైల్ ఫోన్, ట్యాబ్, ఐప్యాడ్‌ల ద్వారా దరఖాస్తు చేయకూడదు. డెస్క్‌టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్‌టా్‌పను మాత్రమే ఉపయోగించాలి.
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌ను ఉపయోగించాలి. వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
దరఖాస్తు చేసేటపుడు మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. కాబట్టి మొబైల్‌ను పక్కనే ఉంచుకోవాలి. ఎస్‌ఎంఎస్ ఫీచర్‌ను బ్లాక్ చేయకూడదు.
వెబ్ ఆప్షన్స్ తేదీలను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.2950; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2360
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 4
దరఖాస్తుతో పాటు అప్‌లోడ్ చేయాల్సిన పత్రాలు: నీట్ ర్యాంక్ కార్డ్; అభ్యర్థి ఫొటో, సంతకం; పదోతరగతి, ఇంటర్ సర్టిఫికెట్‌లు, మార్కుల పత్రాలు; ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్‌లు; టీసీ; కులం, ఆదాయం, నివాసం, వైకల్యం, ఎన్‌సీసీ సంబంధిత ధ్రువ పత్రాలు; ఆధార్ కార్డ్
వెబ్‌సైట్: http://ntruhs.ap.nic.in