NCPULప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-11-28T17:59:12+05:30 IST

న్యూఢిల్లీ(New Delhi)లోని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఉర్దూ లాంగ్వేజ్‌(National Council for Promotion of Urdu Language) (ఎన్‌సీపీయూఎల్‌) - ‘డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌

NCPULప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌
నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ(New Delhi)లోని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఉర్దూ లాంగ్వేజ్‌(National Council for Promotion of Urdu Language) (ఎన్‌సీపీయూఎల్‌) - ‘డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బిజినెస్‌ అకౌంటింగ్‌ అండ్‌ మల్టీ లింగ్వల్‌ డీటీపీ’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్‌కు చండీగఢ్‌లోని నీలిట్‌ సహకారం అందిస్తుంది. సెలెక్షన్‌ కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు.

ప్రోగ్రామ్‌ వివరాలు: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఇందులో ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇంటర్నెట్‌ టెక్నాలజీ అండ్‌ వెబ్‌ డిజైనింగ్‌, ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌ - ట్యాలీ అండ్‌ పర్సనాలిటీ డెవల్‌పమెంట్‌, ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ ఐటీ, మల్టీ లింగ్వల్‌ డీటీపీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ పైథాన్‌, ప్రాక్టికల్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ వర్క్‌ అనే ఏడు మాడ్యూల్స్‌ ఉంటాయి. మొత్తం 40 సీట్లు ఉన్నాయి.

అర్హత: కనీసం పదోతరగతి/ మెట్రిక్యులేషన్‌ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 15 ఏళ్లు నిండి ఉండాలి.

ముఖ్య సమాచారం

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: డిసెంబరు 3

సెలెక్షన్‌ కమిటీ ఇంటర్వ్యూలు: డిసెంబరు 6 నుంచి 8 వరకు

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: డిసెంబరు 12న

ప్రోగ్రామ్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: డిసెంబరు 16

ప్రోగ్రామ్‌ ఫీజు చెల్లించిన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: డిసెంబరు 22

ప్రోగ్రామ్‌ ప్రారంభం: 2023 జనవరి 2 నుంచి

వెబ్‌సైట్‌: www.urducouncil.nic.in

Updated Date - 2022-11-28T17:59:14+05:30 IST