Manageలో పీజీడీఎం (అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్)
ABN , First Publish Date - 2022-10-17T22:02:01+05:30 IST
హైదరాబాద్ - రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(మేనేజ్) - ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్)’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్‌నకు
హైదరాబాద్ - రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(మేనేజ్) - ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్)’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్‌నకు ఏఐసీటీఈ గుర్తింపు ఉంది. ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. ఇందులో ఏడు ట్రైమెస్టర్లు ఉంటాయి. నాలుగో ట్రైమెస్టర్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది.
స్పెషలైజేషన్ విభాగాలు: ఫైనాన్స్, మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్, అనలిటిక్స్
అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ సైన్సెస్/ అగ్రికల్చర్ సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. హ్యుమానిటీస్/ సోషల్ సైన్సెస్/ ఇంజనీరింగ్/ ప్యూర్ సైన్సెస్/ కామర్స్ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులు కూడా అర్హులే. డిగ్రీ స్థాయిలో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. క్యాట్ 2022 అర్హత పొంది ఉండాలి.
ఎంపిక: క్యాట్ 2022 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. క్యాట్ 2022 స్కోర్నకు 55 శాతం, డైవర్సిటీ ఫ్యాక్టర్‌కు 6 శాతం, ఎస్సే రైటింగ్‌కు 5 శాతం, గ్రూప్ డిస్కషన్స్‌కు 10 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 14 శాతం, అనుభవానికి గరిష్ఠంగా 5 శాతం, అకడమిక్ ప్రతిభకు గరిష్ఠంగా 5 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.1200 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600)
ఆన్లైన్/ ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 31
వెబ్సైట్: www.manage.gov.in