జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో Fine Arts ‌Design ‌Entrance Examination

ABN , First Publish Date - 2022-06-01T20:19:12+05:30 IST

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ(Jawaharlal Nehru University of Architecture and Fine Arts) (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)- ‘ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌(Fine Arts ‌Design ‌Entrance Examination) (ఎఫ్‌ఏడీఈఈ) 2022’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌..

జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో Fine Arts ‌Design ‌Entrance Examination

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ(Jawaharlal Nehru University of Architecture and Fine Arts) (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)- ‘ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌(Fine Arts ‌Design ‌Entrance Examination) (ఎఫ్‌ఏడీఈఈ) 2022’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీ డిజైన్‌) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.


కోర్సులు - సీట్లు: బీఎఫ్‌ఏ కోర్సులో అయిదు స్పెషలైజేషన్లు ఉన్నాయి. రెగ్యులర్‌ కేటగిరీలో అప్లయిడ్‌ ఆర్ట్‌ 35, పెయింటింగ్‌ 20, స్కల్‌ప్చర్‌ 10, ఫొటోగ్రఫీ 30 సీట్లు ఉన్నాయి. ఎస్‌ఎస్‌ఎస్‌ కేటగిరీలో అప్లయిడ్‌ ఆర్ట్‌ 15, పెయింటింగ్‌ 15, స్కల్‌ప్చర్‌ 10, యానిమేషన్‌ 60, ఫొటోగ్రఫీ 15 సీట్లు ఉన్నాయి. బీ.డిజైన్‌ కోర్సులో ఇంటీరియర్‌ డిజైన్‌ స్పెషలైజేషన్‌ ఉంది. ఇందులో ఎస్‌ఎస్‌ఎస్‌ కేటగిరీ కింద 60 సీట్లు ఉన్నాయి. 

ఎఫ్‌ఏడీఈఈ వివరాలు: ఎగ్జామ్‌లో భాగంగా ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్‌ పేపర్‌లు ఉంటాయి. బీఎఫ్‌ఏ(అప్లయిడ్‌ ఆర్ట్‌, పెయింటింగ్‌, స్కల్‌ప్చర్‌, యానిమేషన్‌) ప్రోగ్రామ్‌లకు ఎ, బి, సి పేపర్‌లు; బీఎ్‌ఫఏ(ఫొటోగ్రఫీ) ప్రోగ్రామ్‌కు డి, ఇ పేపర్‌లు; బీ డిజైన్‌(ఇంటీరియర్‌ డిజైన్‌) ప్రోగ్రామ్‌నకు ఎఫ్‌ పేపర్‌ రాయాల్సి ఉంటుంది. 


  • ఎ-పేపర్‌లో మెమొరీ డ్రాయింగ్‌ అండ్‌ కలరింగ్‌ ఎగ్జామ్‌ ఉంటుంది. దీనికి 100 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం గంటన్నర
  • బి-పేపర్‌లో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. దీనికి 50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 50 నిమిషాలు
  • సి-పేపర్‌లో ఆబ్జెక్ట్‌ డ్రాయింగ్‌ ఎగ్జామ్‌ ఉంటుంది. దీనికి 100 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం గంటన్నర
  • డి-పేపర్‌లో 100 మార్కులకు కంపోజిషన్‌ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌ ఎగ్జామ్‌ ఉంటుంది. పరీక్ష సమయం గంటన్నర
  • ఇ-పేపర్‌లో 50 మార్కులకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 50 నిమిషాలు
  • ఎఫ్‌-పేపర్‌లో 200 మార్కులకు డిజైన్‌ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం మూడు గంటలు.
  • ఎగ్జామ్‌ను ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించాలంటే కనీసం 35 శాతం మార్కులు రావాలి.

ముఖ్య సమాచారం

ప్రోగ్రామ్‌ ఫీజు: రెగ్యులర్‌ అభ్యర్థులు ఏడాదికి రూ.35,000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌ఎస్‌ఎస్‌ కేటగిరీ అభ్యర్థులు బీ డిజైన్‌(ఇంటీరియర్‌ డిజైన్‌) ప్రోగ్రామ్‌నకు రూ.75,000; బీఎఫ్‌ఏ(యానిమేషన్‌) ప్రోగ్రామ్‌నకు రూ.70,000; బీఎఫ్‌ఏ(అప్లయిడ్‌ ఆర్ట్‌, పెయింటింగ్‌, స్కల్‌ప్చర్‌, ఫొటోగ్రఫీ) ప్రోగ్రామ్‌లకు రూ.65,000 చెల్లించాల్సి ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1800; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.900   

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 20

ఎఫ్‌ఏడీఈఈ 2022 తేదీలు: బీఎఫ్‌ఏ(ఫొటోగ్రఫీ), బీ డిజైన్‌ (ఇంటీరియర్‌ డిజైన్‌) ప్రోగ్రామ్‌లకు జూలై 2; బీఎఫ్‌ఏ(అప్లయిడ్‌ ఆర్ట్‌, పెయింటింగ్‌, స్కల్‌ప్చర్‌, యానిమేషన్‌) ప్రోగ్రామ్‌నకు జూలై 3

వెబ్‌సైట్‌: www.jnafauadmissions.com

Updated Date - 2022-06-01T20:19:12+05:30 IST