CISFలో భారీగా కానిస్టేబుల్ పోస్టులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే..!
ABN , First Publish Date - 2022-01-31T21:18:05+05:30 IST
భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) దేశవ్యాప్తంగా తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
సీఐఎస్ఎఫ్లో 1149 కానిస్టేబుల్ పోస్టులు
భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) దేశవ్యాప్తంగా తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: కానిస్టేబుల్/ఫైర్(మేల్)
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్-79; తెలంగాణ-30
అర్హత: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/తత్సమాన ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 2022 మార్చి 04 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: పే లెవల్-3 ప్రకారం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎ్సటీ), రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: పీఈటీ/పీఎ్సటీలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను ఓఎంఆర్/కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు. పరీక్ష సమయం 120 నిమిషాలు.
పార్ట్ ఏ-జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్- 25 ప్రశ్నలు- 25 మార్కులు
పార్ట్ బి-జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
పార్ట్ సి-ఎలిమెంటరీ మేథమెటిక్స్ - 25 ప్రశ్నలు - 25 ప్రశ్నలు
పార్ట్ డి-ఇంగ్లీష్/హిందీ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 04
వెబ్సైట్: https://cisfrectt.in/