Competitive exams: తెలంగాణ బడ్జెట్‌ 2022-23 వివరాలు ఇలా..

ABN , First Publish Date - 2022-11-21T16:55:41+05:30 IST

పోటీ పరీక్షల్లో ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం పెరిగింది. ఇందులో బడ్జెట్‌ కేటాయింపులు, కొత్త ప్రాజెక్ట్‌లు తదితర అంశాలపై అభ్యర్థులు తప్పనిసరిగా దృష్టి సారించాలి. ఇందులో భాగంగా

Competitive exams: తెలంగాణ బడ్జెట్‌ 2022-23 వివరాలు ఇలా..
తెలంగాణ బడ్జెట్‌

పోటీ పరీక్షల్లో ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం పెరిగింది. ఇందులో బడ్జెట్‌ కేటాయింపులు, కొత్త ప్రాజెక్ట్‌లు తదితర అంశాలపై అభ్యర్థులు తప్పనిసరిగా దృష్టి సారించాలి. ఇందులో భాగంగా ఒకసారి తెలంగాణ బడ్జెట్‌(Telangana Budget)ను పరిశీలిద్దాం.

తెలంగాణ బడ్జెట్‌ను 2022-23 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్‌రావు(Finance Minister Harish Rao) 2022 మార్చి 7న శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను శాసనమండలిలో రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ అంచనాలు ఈవిధంగా ఉన్నాయి.

మొత్తం బడ్జెట్‌ అంచనా - రూ.2,56,958 కోట్లు

రెవెన్యూ రాబడి - రూ.1,93,029 కోట్లు

పెట్టుబడులు రాబడులు - రూ.63,832 కోట్లు

రెవెన్యూ వ్యయం - రూ.1,89,274 కోట్లు

పెట్టుబడి వ్యయం - రూ.29,728 కోట్లు

రెవెన్యూ మిగులు - రూ.3,754 కోట్లు

ద్రవ్యలోటు - రూ.52,167 కోట్లు

ప్రాథమిక లోటు - రూ.33,255 కోట్లు

బడ్జెట్‌ ముఖ్యాంశాలు

 • రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయం, అటవీ వర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

 • మరో ఎనిమిది వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.1000 కోట్లను ప్రతిపాదించింది.

 • రూ.75,000 లోపు వ్యవసాయ రుణాలు మాఫీకి నిర్ణయించారు.

 • తొలిసారిగా చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమా పథకాన్ని ప్రకటించింది.

 • భవన నిర్మాణ కార్మికులకు మొదటి విడతగా లక్షమందికి మోటార్‌ సైకిళ్లను అందజేయనుంది.

 • గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగించేలా నిధులను ప్రతిపాదించారు. దీనికోసం రూ.1000 కోట్లు కేటాయించారు.

 • స్థలం ఉంటే రెండు పడక గదుల ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు.

 • ఆసరా పెన్షన్‌ను 57 సంవత్సరాలకు అమలు చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు.

 • 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌కు రూ.1000 కోట్లు కేటాయించారు.

 • బాలింతల్లో రక్తహీనత సమస్య పరిష్కారానికి కేసీఆర్‌ పోషకాల కిట్‌ను ఈ బడ్జెట్‌లో రూపకల్పన చేశారు.

 • ఏడు నుంచి పన్నెండో తరగతి చదివే ఏడు లక్షలమంది విద్యార్థులకు ఆరోగ్య సంరక్షణ కిట్‌ను అమలుచేయనున్నారు.

 • వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 1.77 లక్షల కుటుంబాలకు దళితబంధు అమలుకు వీలుగా రూ.17,700 కోట్లు కేటాయించారు.

 • బాలింతల పౌష్టికాహార సమస్యకు, రక్తహీనత సమస్య పరిష్కారానికి కేసీఆర్‌ న్యూట్రిషయస్‌ కిట్‌ పథకాన్ని ప్రారంభించనున్నారు.

 • పన్ను రాబడుల అంచనా తొలిసారిగా రూ.లక్ష కోట్లు మార్క్‌ ఈ బడ్జెట్‌లో దాటింది. రూ.1.08 లక్షల కోట్లు పన్ను రాబడులను అంచనా వేసింది.

 • దేశంలోని రాష్ట్రాలు చేస్తున్న అభివృద్ధి వ్యయంతో తెలంగాణ రెండోస్థానంలో ఉంది. మొదటిస్థానంలో గోవా నిలిచింది.

 • ఈ ఆర్థిక సంవత్సరం ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, వికారాబాద్‌, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు మంజూరు చేశారు.

 • వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2023-24లో మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగు, వరంగల్‌, నారాయణపేట, గద్వాల యాదాద్రి జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తారు.

 • సీపిఎస్‌ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్‌ అమలు చేస్తారు.

 • జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 256 బస్తీ దవాఖానాల సంఖ్య 350కు పెంచనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లోనూ 60 బస్తీ దవాఖానాల ఏర్పాటు.

 • ఆరోగ్యశ్రీ చికిత్సలో భాగంగా ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకూ గరిష్ఠ పరిమితి ఉంది. దీనిని రూ.5 లక్షలకు పెంచారు.

 • రాష్ట్రంలో గుండె, కాలేయం, బోన్‌మ్యారో తదితర అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షలు వరకు చెల్లిస్తున్నారు.

 • ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్షయ, క్యాన్సర్‌ తదితర రోగులకు బలవర్థక ఆహారాన్ని అందించేందుకు ఆహార చార్జీలను ఒక్కో పడకకు 56 రూపాయల నుంచి 112 రూపాయలకు పెంచారు. సాధారణ రోగులకు ఒక్కో పడకకు రూ.40 నుంచి రూ.80కు పెంచనున్నారు.

 • ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య ప్రమాణాలు మెరుగు, కార్మికులకు వేతనాలు పెంపునకు ఒక్కో పడకకు రూ.5 వేల నుంచి రూ.7500 లకు పెంచారు.

 • హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాల, సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్‌ కళాశాలను విశ్వవిద్యాలయాలుగా మార్చనున్నారు. దీనికోసం వందకోట్లు చొప్పున నిధులు ఒక్కోదానికి కేటాయిస్తారు.

 • రాయదుర్గం - శంషాబాద్‌ మార్గంలో మెట్రోరైలు ఏర్పాటుకు రూ.377 కోట్ల రూపాయలను కేటాయించారు. పాతబస్తీలో కూడా మెట్రో ఏర్పాటుచేయనున్నారు.

 • రాష్ట్ర బడ్జెట్‌లో మెట్రోరైలు ప్రాజెక్టుకు రూ.2,377 కోట్లను కేటాయించారు.

 • గిరిజన తండాల్లో రోడ్ల అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించారు.

 • 20 కోట్ల రూపాయలతో సాఫ్ట్‌డ్రింక్‌ పరిశ్రమగా నీరాను ప్రారంభిస్తారు.

 • గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, ఆల్వాల్‌, ఎర్రగడ్డలో సూపర్‌ స్పెషాలిటీ దవాఖానాలకు రూ.1000 కోట్లు కేటాయించారు.

2022-23 బడ్జెట్‌ కేటాయింపులు
సంక్షేమశాఖల వారీగా కేటాయింపులు
(రూ.కోట్లలో)

ఎస్సీలు 20,624.88 కోట్లు

ఎస్టీలు 3,415.40 కోట్లు

బీసీలు 5,697.55 కోట్లు

మైనార్టీలు 1,728.70 కోట్లు

మొత్తం 31,466.53 కోట్లు

ప్రధాన ప్రాజెక్టులకు కేటాయింపులు

1) కాళేశ్వరం ప్రాజెక్టు 12,000 కోట్లు

2) పాలమూరు-రంగారెడ్డి 2,000 కోట్లు

3) సీతారామ ఎత్తిపోతలు 940 కోట్లు

4) దేవాదుల 350 కోట్లు

5) కంతనపల్లి 43 కోట్లు

6) ఎల్లంపల్లి వరద కాలువ 220 కోట్లు

7) నాగార్జునసాగర్‌ 170 కోట్లు

8) ఎస్‌ఎల్‌బీసీ 180 కోట్లు

9) డిండి 300 కోట్లు

10) నెట్టెంపాడు 120 కోట్లు

11) ఎల్లంపల్లి 350 కోట్లు

12) కల్వకుర్తి 175 కోట్లు

13) భీమా ఎత్తిపోతలు 55 కోట్లు

14) కోయిల్‌సాగర్‌ 45 కోట్లు

15) నిజాంసాగర్‌ 140 కోట్లు

16) లోయర్‌ పెన్‌గంగా 277 కోట్లు

17) సీ.ఈ.ఆదిలాబాద్‌ పరిధి 320 కోట్లు

18) శ్రీశైలం ఎడమగట్టు కాలువ 178.58 కోట్లు

19) శ్రీరామసాగర్‌ వరద కాలువ 220 కోట్లు

20) చిన్నతరహా నీటిపారుదల 1245 కోట్లు

21) మధ్యతరహా ప్రాజెక్టులు 283 కోట్లు'

విద్యాశాఖకు కేటాయింపులు

1) పాఠశాల విద్యాశాఖ 13,685.48 కోట్లు

2) ఉన్నతవిద్య 1962.77 కోట్లు

3) సాంకేతిక విద్య 394.92 కోట్లు

మొత్తం 16,043.17 కోట్లు

వైద్యశాఖకు కేటాయింపులు(2022-23)

1) వైద్యవిధాన పరిషత్‌లో

ఆస్పత్రుల అభివృద్ధి 250 కోట్లు

2) ఔషధాలకు 377.43 కోట్లు

3) 104 వాహనాలకు 15 కోట్లు

4) 108 వాహనాలకు 30 కోట్లు

5) 102 వాహనాలకు(అమ్మఒడి) 5 కోట్లు

6) పీహెచ్‌సీల్లో పరికరాలకు 50 కోట్లు

7) జిల్లా ప్రాంతీయ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్స వస్తువులకు 75 కోట్లు

8) బోధన ఆస్పత్రుల్లో

నిర్ధారణ పరీక్షలకు 250 కోట్లు

ముఖ్య శాఖలకు కేటాయింపులు

(రూ.కోట్లలో) 2022-23

1) ఆర్థికం 43,088 కోట్లు

2) వ్యవసాయం 24,254 కోట్లు

3) రెండు పడకల ఇళ్లు 12,000 కోట్లు

4) అన్ని సంక్షేమ శాఖలకు 31,466 కోట్లు

5) రోడ్లు భవనాలు 23,191 కోట్లు

6) ఆసరా పించన్లు 11,728 కోట్లు

7) దళితబంధు 17,700 కోట్లు

8) నీటిపారుదల 22,675 కోట్లు

9) వైద్యారోగ్యం 11,237 కోట్లు

10) పంచాయతీరాజ్‌,

గ్రామీణాభివృద్ధి 29,586 కోట్లు

11) విద్య 16,043 కోట్లు

12) పట్టణాభివృద్ధి 10,903 కోట్లు

ఇతర కేటాయింపులు

 1. ట్రిపుల్‌ ఆర్‌కు రూ.500 కోట్లు

 2. మహిళా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు పావలావడ్డీ పథకానికి రూ.187 కోట్లు

 3. 2.5 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా ఆయిల్‌పామ్‌కు 100 కోట్లు

 4. ధూపదీపంలోకి మరో 1736 ఆలయాలను చేర్చారు. దీనికోసం 12.50 కోట్లు

 5. మన ఊరు - మన బడికి 7,289 కోట్లు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభం

 6. విద్యుత్‌ రంగానికి 12,209 కోట్లు, వచ్చే ఏడాది యాదాద్రి అలా్ట్ర మెగా ప్రాజెక్టు ఉత్పత్తి ప్రారంభం.

 7. ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, రామగుండం నగరపాలక సంస్థలకు ఒక్కోదానికి 10 కోట్లు

 8. సచివాలయాలకు 400 కోట్లు

 9. స్థానిక సంస్థలకు 2,513 కోట్లు

 10. టీఎస్‌ ఆర్టీసికి 1500 కోట్లు

  Rayala-Radhakrishna.gif

-రాయల రాధాకృష్ణ

సీనియర్‌ ఫ్యాకల్టీ

Updated Date - 2022-11-21T16:55:41+05:30 IST

Read more